Priyanka Day Haseena : రేపే థియేటర్లోకి హసీనా.. ప్రియాంక డే సందడి షురూ
Priyanka Day Haseena ప్రియాంక డే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హసీనా మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో థన్వీర్, సాయి తేజ గంజి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీ మే 19న రిలీజ్ కాబోతోంది. రేపు ప్రియాంక డే థియేటర్లో సందడి చేయనుంది.
Priyanka Day Haseena ఇప్పుడు జనాలు ఏ సినిమాను చూస్తున్నారు.. ఏ సినిమాను ఎందుకు తిరస్కరిస్తున్నారు అనేది చెప్పడం కష్టంగా మారింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఆడేస్తున్నాయి. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలూ ఆడేస్తున్నాయి. అయితే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉంది.
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లను ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కథ, కథనాలు బాగుంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను జనాలు హిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక డే టైటిల్ రోల్‌లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో హసీనా అనే చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా వ్యవహరించాడు. ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. నవీన్ ఇరగాని దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీని మే 19న విడుదల చేయనున్నారు. రేపే ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది.
హసీనా మూవీ ప్రమోషన్స్ కోసం ప్రకాష్ రాజ్, అడివి శేష్, నిఖిల్ వంటి హీరోలు వచ్చారు. ఈ మూవీ పోస్టర్‌ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా యంగ్ హీరోలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
Also Read: Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను మే 19న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు రామ కందా కెమెరామెన్‌గా పని చేశారు. హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేయగా.. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందించారు. సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు.
Also Read: Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook