Puri Jagannadh Jana Gana Mana Story: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 'జన గణ మన' సినిమాను అనౌన్స్ చేయడమే ఆలస్యం.. ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. ఇది పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం... విజయ్ దేవరకొండ లాంటి పెర్ఫామర్‌ హీరోగా ఉండటంతో.. సినిమాపై అప్పుడే అంచనాలు ఓ రేంజ్‌కి చేరాయి. ఈ సినిమా కథకు సంబంధించి ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదొక ఫిక్షన్ కథ అని చెప్పిన పూరి జగన్నాథ్... తన దేశం కోసం, తన దేశ పౌరుల కోసం ఒక సైనికుడు కనే కలనే ఈ సినిమా అని తెలిపారు. దేశభక్తి, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుందన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా చేయాలని చాలా ఏళ్ల నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని... విజయ్ దేవరకొండ వల్ల ఇన్నాళ్లకి ఆ కల నిజం కాబోతోందని చెప్పారు.


ఇదే ప్రెస్ మీట్‌లో నటి, నిర్మాత చార్మి మాట్లాడుతూ.. జన గణ మన సినిమాలో పూర్తి భిన్నమైన విజయ్ దేవరకొండను చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా ఎగ్జయిటింగ్ అనిపించిందని.. ఇందులో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. పూరి గురించి ఒక్క లైన్‌లో చెప్పాలని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు... 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని బదులిచ్చాడు విజయ్.


నిజానికి జన గణ మన సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించాలని పూరి గతంలో చాలానే ప్రయత్నించాడు. అయితే మహేష్ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టేశాడు. విజయ్ ఆ సబ్జెక్ట్‌కి పర్ఫెక్ట్ అని భావించడంతో అతనితో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న జన గణ మన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు పూరి ప్రకటించేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదలకు ముందే.. మరో మూవీ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. లైగర్ ఈ ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Also read:Viral News: 74 ఏళ్ల ఈ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి ఫిదా అవాల్సిందే... ఆ ఫ్లూయెన్సీ ఎలా వచ్చిందంటే.


Also read: Video: లాంగ్ గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్‌లోకి సాయి ధరమ్ తేజ్... ఎమోషనల్ అయిన మెగా హీరో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook