Video: లాంగ్ గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్‌లోకి సాయి ధరమ్ తేజ్... ఎమోషనల్ అయిన మెగా హీరో

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా షూటింగ్‌ సెట్‌కి వచ్చాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 03:12 PM IST
  • ఆర్నెళ్ల తర్వాత షూటింగ్‌కి సాయి ధరమ్ తేజ్
  • తేజ్‌కి చిత్ర యూనిట్ గ్రాండ్ వెల్ కమ్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Video: లాంగ్ గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్‌లోకి సాయి ధరమ్ తేజ్... ఎమోషనల్ అయిన మెగా హీరో

Sai Dharam Tej Latest: సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా షూటింగ్‌ సెట్‌కి వచ్చాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 'వెల్‌కమ్ బ్యాక్ సాయి' అంటూ ప్లకార్డులతో గ్రాండ్ వెల్‌కమ్ పలికింది. సాయి ధరమ్ తేజ్‌పై పూల వర్షం కురిపించింది. దీంతో సాయి ధరమ్ తేజ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోని ఎస్‌వీసీసీ నిర్మాణ సంస్థ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు.

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్వీసీసీ, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో ఇతర నటీ నటులు, టెక్నీషియన్స్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ రీఎంట్రీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతేడాది సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్.. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరాక చాలా రోజుల పాటు ఆయన ఎక్కడా కనిపించలేదు. వైద్యుల సూచన మేరకు సాయి పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఇటీవలే పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ చేశారు. సాయి ధరమ్ తేజ్ రీఎంట్రీ పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ దండుతో చేస్తున్న మూవీతో పాటు మరో రెండు సినిమాలకు సాయి ధరమ్ తేజ్ కమిట్ అయ్యాడు. త్వరలోనే ఆ రెండు కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. 

Also Read: Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. ఐదు రోజుల్లో రూ. 3.10 పెరిగిన పెట్రోల్‌ రేట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News