Pushpa 2 wildfire event: కిస్సిక్ సాంగ్ విడుదల.. హైలెట్ గా నిలిచిన శ్రీలీల.. రష్మికపై సెటైర్
Kissik Song: ఈరోజు చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్.. చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఈ సినిమా ఐటమ్ సాంగ్ విడుదల చేయడం మరో విశేషం. కాగా.. ఈ ఈవెంట్లో శ్రీ లీల, రష్మిక, అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Pushpa 2: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్..డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్ పుష్ప: ది రైజ్ కి కొనసాగింపుగా వస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్..పాటల ద్వారా భారీ స్పందనను సాధించింది.
తాజాగా, తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన వైల్డ్ ఫైర్ ఈవెంట్‌కి ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాల లియో ముత్తు ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో పుష్ప 2కి సంబంధించిన ప్రత్యేక సాంగ్ 'కిస్సిక్'ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో చిత్ర యూనిట్ పాల్గొని, అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.
ఇక ఈ ఈవెంట్లో శ్రీలీల ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో పక్క కిసిక్ ఐటమ్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలై.. సెన్సేషన్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఈ అంటావా మామ పాట రేంజ్ లో ఈ సాంగ్ కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక పుష్ప వన్ లో ఐటమ్ సాంగ్ లో ఉ అంటావా మామ..పాట లాగా..దెబ్బలు పడతాయి రోయ్ అనే పదంతో సాగింది ఈ సాంగ్. అంతేకాదు ఈ సాంగ్‌లో రష్మిక గురించి జరిగిన ఒక విషయంపై సెటైర్ కూర రాసినట్టున్నారు గేయ రచయిత అందు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఈ సాంగ్‌లో ఫోటోకి మార్ఫింగ్ చేస్తే దెబ్బలు పడాతాయ్.. రోయ్ అనే లైన్ వస్తుంది. ఇక రష్మిక మార్ఫింగ్ ఫోటో అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసింది. సోషల్ మీడియాలో జరిగిన ఆ రచ్చకి ఈ లిరికి బలే సూట్ అయింది అంటూ.. రష్మిక అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక ఈ పాట ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
ఇక ఈ వైల్డ్ ఫైర్ ఈవెంట్లో అల్లు అర్జున్, రష్మిక కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో..సందర్భంగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధి అర్చన కల్పాతి మాట్లాడుతూ, “తమిళనాడులో ఈ చిత్రాన్ని 600 స్క్రీన్స్‌లో విడుదల చెయ్యబోతున్నందుకు గర్వంగా ఉంది. డిసెంబర్ 5న 3500 షోలు ప్లాన్ చేస్తున్నాం. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ గార్ల పర్ఫామెన్స్ అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది,” అని చెప్పారు.
మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ మాట్లాడుతూ, “పుష్ప 1తో ఫైర్ మొదలుపెట్టి, పుష్ప 2తో వైల్డ్ ఫైర్ సృష్టించాం. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండస్ట్రీపై ప్రభావం చూపడం ఖాయం. అల్లు అర్జున్ గారు ఈ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు పొందుతారు,” అని విశ్వాసం వ్యక్తం చేశారు. పుష్ప టీమ్ చెన్నై ఈవెంట్ విజయవంతం కావడంతో, దేశవ్యాప్తంగా ఇంకా పలు ఈవెంట్లను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది చదవండి: Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.