Pushpa Part 2: పుష్ప పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ నటితో లెక్కల మాస్టారు సంప్రదింపులు
Pushpa Part 2: పుష్ప మేనియా ఇంకా వదల్లేదు. ఊ అంటావా మావా..అంటూ ఉర్రూతలూగుతూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 2 లో ఇప్పుడు మరో ఐటమ్ సాంగ్ సిద్ధమౌతోంది. ఈసారి బాలీవుడ్ నటి రంగంలో దిగనున్నట్టు సమాచారం.
Pushpa Part 2: పుష్ప మేనియా ఇంకా వదల్లేదు. ఊ అంటావా మావా..అంటూ ఉర్రూతలూగుతూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 2 లో ఇప్పుడు మరో ఐటమ్ సాంగ్ సిద్ధమౌతోంది. ఈసారి బాలీవుడ్ నటి రంగంలో దిగనున్నట్టు సమాచారం.
బాలీవుడ్ లేదా టాలీవుడ్..ఏ వుడ్ అయినా సరే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్‌లో అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాల్సిందే. ఐటమ్ సాంగ్ చేసే నటి , పాటలో లిరిక్స్, ట్యూన్, మ్యూజిక్, డ్యాన్స్ ఏదీ తగ్గకూడదు. అప్పుడే హిట్ కొడుతుంది. పుష్పలో ఊ అంటావా మావా పాట అందుకే అంత హిట్టైంది. ఉఊ అంటావా అంటూ ఇంకా ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఇదంతా ఓ ఎత్తైతే..ఈ పాటకు ప్రముఖ టాలీవుడ్ నటి సమంత డ్యాన్స్ చేయడం ప్రధాన ఆకర్షణ. ఈ పాటకు సమంతే హైలైట్. ఇక పాట పాడిన మంగ్లి సోదరి గమ్మత్తైన గొంతు, అద్భుతైన డీఎస్పీ సంగీతం. వెరసి పాటను ఎక్కడికో తీసుకెళ్లింది. పాట చుట్టూ వివాదమున్నా..వ్యూస్‌లో అగ్రస్థానంలో నిలిచేసింది.
ఇక పుష్ప విజయంతో లెక్కల మాస్టారు సుకుమార్ పుష్ప పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. పార్ట్ 1లో ఉన్నట్టే పార్ట్ 2లో కూడా అదే స్థాయిలో మరో ఐటమ్ సాంగ్ సిద్ధం చేస్తున్నాడు. దీనికోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దిశతో చర్చలు కూడా పూర్తయినట్టు సమాచారం. పుష్ప ఐటమ్ సాంగ్‌లో చేసేందుకు దిశా పటానీ అంగీకరించినట్టు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావా పాటను తలదన్నే రీతిలో పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.
Also read: Priyanka Chopra: భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ హోలీ.. క్రేజీగా ఇద్దరి లిప్ లాక్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook