Pushpa Part 2 First Night Short Film: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో కావాల్సినంత కంటెంట్ దొరుకుతోంది. తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఎంతోమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. గతంలో టిక్‌టాక్ యాప్‌ ద్వారా ఫేమస్ అయిన ఎంతోమంది తారలను మనం చూశాం. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమ్ దక్కించుకున్న వాళ్లు అన్ని చోట్లా అలరిస్తున్నారు. 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సరయు బిగ్‌ బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ఉన్నారు. తాజాగా 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూట్యూబ్‌లో స్ఫూఫ్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఐకాన్ స్టార్ పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ పార్ట్‌-2 ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్ అంటూ 7 ఆర్ట్స్ చేసిన స్పూఫ్ అలరిస్తోంది. పుష్ప సినిమాలోని పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉన్నాయి. పుష్ప రాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ యాక్ట్ చేశారు. పుష్ప పాత్రలో శ్రీకాంత్ రెడ్డి నటించడమే కాకుండా.. మొత్తం తానై నడిపించాడు. 


 



కాన్సెప్ట్ రాసుకున్న శ్రీకాంత్ రెడ్డి.. షార్ట్ ఫిల్మ్‌కు డైరెక్షన్‌తోపాటు ఎడిటిండ్ బాధ్యతలు కూడా చూసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్పూఫ్‌ షార్ట్ ఫిల్మ్‌కి యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నాయి. పుష్ప 2 మూవీ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ కాన్సెప్ట్‌ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్‌ను తీశాడు. షెకావత్ తనను బ్రాండ్ అంటూ పుష్ప అవమానించడం.. ఆ తరువాత రాజకీయాల్లోకి రావాలనుకోవడం.. తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం.. ఇలా శ్రీకాంత్ రెడ్డి ఊహించుకుంటూ కథ రాశాడు. శ్రీకాంత్ రెడ్డి యాక్టింగ్, చిత్తూరు యాస బాగుంది. అన్ని క్యారెక్టర్లు చక్కగా కుదిరాయి. ఎంతో ఫన్నీగా సాగిన ఈ స్ఫూఫ్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter