OTT Release: ఓటీటీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అన్ని సినిమాలకు రెండు రిలీజ్ డేట్స్ ఉంటున్నాయి. థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ ఉంటుంటుంది. అయితే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలైపోతున్నాయి. అలాంటిదే ఈ సినిమా. ఏమాత్రం చడీచప్పుడు లేకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్ ది టాప్ ఓటీటీలకు చాలా కాలంగా ఆదరణ పెరిగిపోయింది. అన్ని భాషల్లో సినిమాలు, కొత్త కొత్త కంటెంట్, వెబ్‌సిరీస్‌లు అందుబాటులో ఉండటమే కాకుండా నచ్చినప్పుడు, నచ్చిన చోటి నుంచి నచ్చినట్టుగా చూసే వీలుండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా నచ్చిన భాషలో చూసే అవకాశముండటం మరో ప్రధాన కారణం. ఓటీటీలకు ఉన్న క్రేజ్ కారణంగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. పుష్ప సినిమాలో విలన్ పాత్రలో అందర్నీ మెప్పించి అందరి దృష్టీ ఆకర్షించి ఫహద్ ఫాజిల్ నటించిన సినిమా ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలో విడుదలైపోయింది. ఈ సినిమా పేరు ధూమమ్. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో జూన్ నెలలోనే థియేటర్ రిలీజ్ కావల్సిన పరిస్థితి. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత ఆగస్టు నెలలో ఓటీటీ విడుదలని చెప్పినా అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు హఠాత్తుగా పలు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 


కేజీఎఫ్, సలార్ వంటి భారీ సినిమాలు తీసిన హోంబలే ఫిల్మ్స్ చిన్న సినిమాలు కూడా తీస్తుంటుంది. అందులో భాగంగానే పుష్ప విలన్ ఫేమ్ ఫహద్ ఫాజిల్ నటించిన ధూమమ్ సినిమా. డబ్బింగ్ పనులు ఆలస్యం అవడంతో తెలుగు వెర్షన్ పక్కనపెట్టేశారు. ఆ తరువాత కన్నడ, మలియాళం విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ ఆపిల్ టీవీ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో వచ్చింది. 


స్పష్టమైన కారణాలేంటో తెలియదు గానీ ఈ సినిమాకు సంబంధించి ఏ ప్రకటనా కచ్చితంగా అమలు కాలేదు. జూన్ 23న అన్ని భాషల్లో విడుదల కావల్సింది తెలుగులో విడుదల కాలేదు. ఆగస్టు 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తామని చెప్పి అదీ అమలు కాలేదు. ఇప్పుడు తాజాగా ఆపిల్ టీవీ ఓటీటీలో విడుదలైంది. ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్ మ్యాన్‌గా పనిచేసే అవినాష్ అనే పాత్రలోని ఫహద్ ఫాజిల్..ఓ అపరిచిత వ్యక్తి కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. తన మాట వినకపోతే అతడి భార్య అంటే ఫహద్ ఫాజిల్ భార్య దియా ( అపర్ణ బాలమురళి) శరీరంలో ఫిక్స్ చేసిన మైక్రో బాంబ్ పేల్చేస్తానంటూ బెదిరింపులకు దిగుతుంటాడు. అదే ధూమమ్ స్టోరీ. 


Also read: R Subbalakshmi: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook