Raashi Khanna Comments: సౌత్ సినీ పరిశ్రమలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్రసీమల్లో తన టాలెంట్‌కు సరిపడ్డ రోల్స్‌ రాలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె కామెంట్స్ చేశారు. ఇదే విషయమై గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో సౌత్ సినీ ప్రియులు హీరోయిన్ రాశీ ఖన్నాపై గుర్రుగా ఉన్నారు. రాశీఖన్నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వస్తున్న నెగటివ్‌ ప్రచారంపై ఎట్టకేలకు నటి రాశీ ఖన్నా స్పందించారు. తనపై జరుగుతున్న విద్వేష ప్రచార వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆమె ఓ పోస్ట్ చేశారు. 



"దక్షిణాది సినీ పరిశ్రమను దూషిస్తూ నేను వ్యాఖ్యలు చేశానంటూ కొన్ని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భాష ఏదైనా సరే.. ప్రతి పరిశ్రమ, తాను చేసే ప్రతి సినిమాపై తనకెంతో గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాబట్టి దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండి" అని నటి రాశీ ఖన్నా వెల్లడించారు. 


'మద్రాస్‌ కేఫ్‌' చిత్రంతో రాశీ ఖన్నా బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా ప్లాప్ కావడం వల్ల ఆమె దక్షిణాదివైపు అడుగులేశారు. ఇక్కడ వరుస విజయాలు అందుకుని గ్లామర్‌ డాల్‌గా రాశీఖన్నా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె మరలా బాలీవుడ్‌ మూవీలో నటించారు. 'రుద్ర' అనే పేరుతో విడుదల అయిన ఈ మూవీకి రాశీకి అక్కడ మంచి మార్కులు పడ్డాయి. 'రుద్ర' విజయం అనంతరం పలు ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాశీఖన్నా.. సౌత్‌ ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 


Also Read: 3 Years for Majili: నాగచైతన్యను మర్చిపోలేకపోతున్న సమంత.. ఇదిగో సాక్ష్యం!


Also Read: Yashoda Release Date: సమంత కొత్త చిత్రం 'యశోద' రిలీజ్ డేట్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook