3 Years for Majili: నాగచైతన్యను మర్చిపోలేకపోతున్న సమంత.. ఇదిగో సాక్ష్యం!

3 Years for Majili: టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరొందిన అక్కినేని నాగచైతన్య, సమంత గతేడాది విడిపోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. అయితే విడిపోయినా కూడా తన మాజీ భర్త నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందట. నాగచైతన్యకు సంబంధించిన ఓ పిక్ ను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదే విషయమై టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 08:59 AM IST
3 Years for Majili: నాగచైతన్యను మర్చిపోలేకపోతున్న సమంత.. ఇదిగో సాక్ష్యం!

3 Years for Majili: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మర్చిపోలేని బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంతల బంధం 'ఏం మాయ చేసావే' మూవీ నుంచి 'మజిలీ' వరుకు సాగింది. కారణం ఏదో తెలియదు గానీ.. కరోనా సంక్షోభంలో వీరిద్దరూ విడాకుల గురించి ప్రకటన చేశారు. ఆ తర్వాత సమంత గురించి చైతన్య.. నాగచైతన్య గురించి సమంత ఒకరికి ఒకరు విడివిడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 

ఇప్పుడు సడెన్ గా సమంత తన మాజీ భర్త నాగచైతన్య పిక్ ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన 'మజిలీ' సినిమా మూడేళ్లు గడిచిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్ ను సామ్ షేర్ చేసింది. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో సమంత, నాగచైతన్య మళ్లీ కలిసే అవకాశం ఉందని అభిమానుల్లో చర్చ నడుస్తోంది. 

అయితే సమంత, నాగచైతన్యలను కలిపేందుకు డైరెక్టర్ నందినీ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కలపడం అంటే.. నిజజీవితంలో కాదు.. ఓ మూవీలో వీరిద్దరిని కలిపి నటించేందుకు నందినీ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారని టాక్. ‘జబర్దస్త్’అనే సినిమాతో డైరెక్టర్ నందినిరెడ్డితో కలిసి సమంత మొదటిసారి పనిచేసింది. ఆ సినిమా నుంచి డైరెక్టర్ నందిని రెడ్డి, సామ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 

ఆ తర్వాత ‘ఓ బేబీ’ సినిమాతో నందినీ రెడ్డి, సమంత కలిసి పనిచేశారు. ఈ కాంబో సూపర్ హిట్టైంది. దీని తర్వాత డైరెక్టర్ నందినీ రెడ్డి.. సామ్‌తో కలిసి మరో మూవీ చేయాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత సమంత మూవీల పరంగా బిజీ కావడం.. అక్కినేని నాగచైతన్యతో విడిపోవడం జరిగాయి. అయినప్పటికి డైరెక్టర్ నందినిరెడ్డి, సమంతల మధ్య ఫ్రెండ్ షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఫ్రెండ్ షిప్‌తోనే డైరెక్టర్ నందినీ రెడ్డి.. నాగ చైతన్యను, సమంతను మళ్లీ కలపాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. 

త్వరలో డైరెక్టర్ నందినీ రెడ్డి, నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ స్టోరి నాగ చైతన్యకి బాగా నచ్చడంతో అతడు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే డైరెక్టర్ నందిని కొత్త మూవీలో హీరోయిన్‌గా పలువురు హీరోయిన్స్‌ను సెలెక్ట్ చేసినప్పటికీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో నాగ చైతన్య సరసన సామ్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందని నందినీ రెడ్డి భావిస్తున్నారు. 

నాగచైతన్య, సమంత వారి పెళ్లికి ముందు 'ఏం మాయ చేశావే', 'ఆటోనగర్ సూర్య', 'మనం' సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం 'మజిలీ'. ఇప్పుడు డైరెక్టర్ నందిన రెడ్డి సినిమా పట్టాలెక్కితే.. చై,సామ్ విడిపోయిన తర్వాత వారిద్దరూ కలిసి నటించిన సినిమాగా ఇది నిలిచిపోతుంది. మరి డైరెక్టర్ నందినిరెడ్డి ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో మనం వేచి చూడాలి.  

Also Read: Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??

Also Read: Chay-Sam: మళ్లీ జతకట్టనున్న సమంత - నాగ చైత్యన్య..? ఎంతవరకు ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News