Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్- ప్రభాస్, పూజాల జోడీ అదిరిందిగా..
Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ సినిమా నుంచి లవ్ అంథెమ్ ఫుల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో ప్రభాస్-పూజా జంట మూవీ లవర్స్‌ను ఫిధా చేస్తోంది.
Radhe Shyam Love Anthem: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్గా నటించిన 'రాధేశ్యామ్' కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెంచుతోంది. నేడు లవ్ అంథెమ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఇప్పటికే ఇదే సాంగ్ హిందీలో విడుదలైంది. ఈ సాంగ్‌లో ప్రభాస్, పూజా హెగ్జేల జోడి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది కూడా.
తెలుగులో నగుమోము తారలె అంటూ సాగే ఈ సాంగ్‌లో.. ప్రభాస్- పూజాల జోడి మధ్య రోమామ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తమిళం, మళయాళం, కన్నడాలో కూడా నేడే ఈ సాంగ్ రిలీజ్ అయ్యింది. మాస్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్న ప్రభాస్ ఈ పాటలో లవర్ బాయ్‌గా సరికొత్తగా కనిపించారు.
రాధేశ్యామ్ సినిమా గురించి..
వచ్చే ఏడాది జనవరి 14న ఈ రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్-పూజా హెగ్జేల జోడీకి ఇది తొలి సినిమా కావడం విశేషం. మరోవైపు సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తుండగా.. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
తెలుగు పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. హీందీ వెర్షన్‌కు మిథూన్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Also read: Bangarraju Song Teaser: ‘బంగార్రాజు’ సినిమా నుంచి ‘నా కోసం’ సాంగ్ టీజర్ రిలీజ్
Also read: Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook