Justin Prabhakaran for Prabhas's film ? ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ప్యాన్ ఇండియా చిత్రం "రాధే శ్యామ్" ( Radhe Shyam movie ) ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Actress Pooja Hegde ) జంటగా నటిస్తుండగా.. యాక్షన్ థ్రిల్లర్ "జిల్" సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన కెకె రాధా కృష్ణ కుమార్ ఈ 'రాధే శ్యామ్' సినిమాని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ణం రాజు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. Also read : Hyderabad Floods: ప్రభాస్ కోటి రూపాయల విరాళం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది టాలీవుడ్‌లో సస్పెన్స్‌గా మారింది. తాజా అప్‌డేట్ ప్రకారం, డియర్ కామ్రెడ్ సినిమాకి ( Dear Comrade ) మ్యూజిక్ కంపోజ్ చేసిన జస్టిన్ ప్రభాకరన్ 'రాధే శ్యామ్' సినిమాకి మ్యూజిక్ అందించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. జస్టిన్ ప్రభాకరన్ కెరీర్‌లో "రాధే శ్యామ్" అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం ఫస్ట్ మోషన్ పోస్టర్ బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల కానుంది. Also read : Prabhas birthday gift: బర్త్ డే గిఫ్టుపై ప్రభాస్ పోస్ట్ 


రాధే శ్యామ్ షూటింగ్ ( Radhe Shyam shooting ) ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే కాకుండా ఇతర ప్రధాన పాత్రలలో సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతి బాబు, జయరామ్, సచిన్ ఖేద్కర్, భీనా బెనార్జీ, మురళి శర్మ, షాషా చెత్రి, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. Also read : Nartanasala first look: నర్తనశాల ఫస్ట్ లుక్ వచ్చేసింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe