Hyderabad Floods: ప్రభాస్ కోటి రూపాయల విరాళం

Radhe Shyam Star Prabhas | హైదరాబాద్ నగరం జలదిగ్భందంలో ( Hyderabad ) చిక్కుకున్న వేళ సినీ ప్రముఖులు తమ వంతుగా చేయూతనిస్తున్నారు.

Last Updated : Oct 20, 2020, 09:22 PM IST
    1. వరద బాధితులకు అండగా కదిలి వస్తోన్న సినీలోకం
    2. రూ. కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్
Hyderabad Floods: ప్రభాస్ కోటి రూపాయల విరాళం

Prabhas Donated One Crore Rupees |హైదరాబాద్ నగరం జలదిగ్భందంలో ( Hyderabad ) చిక్కుకున్న వేళ సినీ ప్రముఖులు తమ వంతుగా చేయూతనిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా ( CM Relief Fund ) విరాళాలు ప్రకటిస్తున్నారు. కష్టాల్లో ఒంటరిగా ఉన్నాం అని ఎవరూ అనుకోవద్దు అని..తాము ఉన్నాము అని చెప్పకనే చెబుతున్నారు సినీ తారలు.

READM ALSO| Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు

తాజాగా సినీ నటుడు ప్రభాస్ తన వంతుగా వరద బాధితులకు సహాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. సినిమాతో పాటు సామాజికి కార్యాల్లో ముందుండే ప్రభాస్ ( Prabhas ) హైదరాబాద్ నగరంలో వరద వల్ల ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలవడానికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నట్టు తెలిపాడు.

అంతకు ముందే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ), నందమూరి తారకరామారావు ( జూనియర్ ), త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్,  నాగార్జునతో పాటు పలువురు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 

 

Trending News