Radhe Shyam Trailer: పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​. రాధే శ్యామ్ మూవీ టీం నుంచి మరో బిగ్​ అప్​డేట్ వచ్చింది. సినిమా ట్రైలర్ రిలీజ్​డేట్​ను ప్రకటించింది చిత్ర యూనిట్​. మార్చి 2 నుంచి సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ అధికారిక ప్రకటన చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఇది వరకే ఓ సారి ట్రైలర్​ విడుదల చేసింది చిత్ర యూనిట్​. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో మరో ట్రైలర్​ను బుధవారం విడుదల చేయనుంది.


రాధేశ్యామ్ గురించి..


ఈ సినిమాలో ప్రభాస్​ విక్రమాదిత్య పేరుతో.. హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. 1970-80ల కాలం నాటి లవ్​ స్టోరీగా తెరకెక్కింది. ప్రేమ, విధి మధ్య పోరాటంగా ఈ సినిమా ఉండనుంది.


ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్స్​, గ్లిమ్స్​, టీజర్​లలో ప్రభాస్​, పూజాల జోడీ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లవ్​ స్టోరీ అయినప్పటికీ ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్​ ఇప్పటికే ప్రకటించింది.



ఈ సినిమాను.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా థార్డ్​వేవ్​ వల్ల విడుదలను వాయిదా వేసింది చిత్ర యూనిట్​.


ఈ మూవీలో జగపతి బాబు, ప్రియదర్శి, కృష్ణం రాజు (తెలుగులో), సత్యరాజ్​ (మిగతా భాషల్లో), బాలీవుడ్ నటి భాగ్య శ్రీ, మురళీ శర్మ, జయరామ్​ సహా పలువురు ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.


రాధా కృష్ణ కుమార్​ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీ సిరీస్​ ఫిలిమ్స్​, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి భూషన్​ కుమార్​, వంశీ, ప్రమోద్​లు నిర్మాతలు.


ప్రభాస్​ నుంచి సాహో తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.


Alsor read: Bheemla Nayak Collection: రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'!


Also read:Nagababu: 'తెలుగు సినిమాలు బ్యాన్ చేయండి'.. మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook