Megastar Chiranjeevi's Bholaa Shankar:  మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'(Bholaa Shankar Movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. Rage of Bholaa(రేజ్‌ ఆఫ్‌ భోళా) అనే ఆంథమ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాట సైతం మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ కు మెహర్ రమేష్, ఫిరోజ్ ఇజ్రాయిల్ లిరిక్స్ అందించారు. ర్యాపర్స్ అసుర, ఫిరోజ్ కలిసి అలపించారు. ''ఒకటి రెండు మూడు వచ్చాడు అన్న సూడు.. స్టేట్ అంత వెతికి చూడు ఎదురు వచ్చేటోడే లేడు''అంటూ సినిమాలో చిరు పాత్రను ఎలివేట్ చేస్తూ సాహిత్యం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో చిరంజీవి జోడిగా తమన్నా నటిస్తోంది. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుంది. సుశాంత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. బ్రహ్మనందం, గెటప్ శ్రీను, హైపర్ ఆది, శ్రీముఖి, రష్మి గౌతమ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించారు. మహతిస్వర సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. వాల్తేరు వంటి బంపర్‌ హిట్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆడియెన్స్ లో హైప్ క్రియేట్ చేశాయి. 



Also read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook