Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Kangana Ranaut First Look Released: చంద్రముఖి-2 మూవీ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. రాఘవ లారెన్స్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆడియన్స్ ముందుకు రానుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 5, 2023, 12:08 PM IST
Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Kangana Ranaut First Look Released: చంద్రముఖి-2 మూవీ ద్వారా భయపెట్టేందుకు బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ రెడీ అవుతోంది. రాఘ‌వ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 18 ఏళ్ల క్రితం సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. కంగనా రనౌత్‌ చంద్రముఖిగా నటిస్తుండడంతో పాన్ ఇండియా లెవల్లో డిజైన్ చేస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా ఆడియన్స్`ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. 

ఇక కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. అందం, అభినయం కలిపి తన చూపులతో ఆకట్టుకుంటోంది. చీరతో భారీ నగలు ధరించింది. ఒక ప్యాలెస్ లోపల నిలబడి కెమెరా నుంచి దూరంగా చూస్తోంది. "అప్రయత్నంగా మన దృష్టిని దొంగిలించే అందం, భంగిమ.. చంద్రముఖి-2 నుంచి చంద్రముఖిగా కంగనా రనౌత్  ఫస్ట్ లుక్.." అంటూ మూవీ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. చంద్రముఖిలో జ్యోతిక తన కళ్లతోనే ఆకట్టుకోగా.. ఈ మూవీలో కంగనా ఎలా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం కంగనా ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. 

 

 

హార‌ర్ జోన‌ర్‌లో చంద్రముఖి సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ లకలక అంటూ పలికిన డైలాగ్ ఎప్పటికీ ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయి. న‌య‌న‌తార‌, ప్ర‌భు, వ‌డివేలు ఇతర పాత్రల్లో అలరించారు. చంద్రముఖిగా జ్యోతిక నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. ఇటీవల రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ పోషించిన రాజా పాత్రలో లారెన్స్ యాక్ట్ చేస్తున్నాడు. తనదైన డ్యాన్సింగ్ స్టైల్, స్వాగ్‌తో ఫస్ట్ లుక్‌లో లారెన్స్ అలరించాడు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మి మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Trending News