Raghava Lawrence: సినిమా ఫ్లాప్..కానీ సీక్వెల్ మాత్రం వదలని దర్శకుడు.. ఇదేం పైత్యం రా బాబు!
Kanchana 4: సినిమాలు ఫ్లాప్ పైన.. మన దర్శకులు ఒకసారి సీరిస్ మొదలుపెడితే.. ఇక ఆ సీరీస్ లో సినిమాలు తీయడం ఆపేల లేరు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్
Kanchana Series: ఈమధ్య సీక్వెల్స్ పైత్యం అందరిలో ముదిరింది. అయితే ఈ పైత్యం లేక ముందే.. ఎంతోమంది దర్శకులు వాళ్ళ సినిమాలకు సీక్వెల్స్ తీసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. సీక్వెల్స్ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ బాహుబలి, పుష్ప లాంటి సినిమాలతో ఈ మధ్య అది కాస్త ఎక్కువైంది. కాగా ఈ చిత్రాలు విడుదల కాకముందే.. రాఘవ లారెన్స్ ముని అనే ఒక సినిమా తీసి.. దానికి సీక్వెల్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్స్ అనడం కన్నా.. ఆ ఫ్రాంచైజ్ లో సినిమాలు తీస్తూ వచ్చారు అనడం కరెక్ట్.
ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి హారర్ సినిమా ముని. ఆ తరువాత ఆ సినిమాకే ముని 2 అని చెప్పి కాంచన అనే చిత్రం తీశారు. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సిరీస్‌లో మూడో సినిమా గంగా అని తర్వాత నాలుగో సినిమా కాంచన 3 అని చేశారు ఈ దర్శకుడు. కాగా ఈ రెండు సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.. కానీ ఈ సిరీస్ కి సీక్వెల్స్ తీయడం మాత్రం వదలడం లేదు రాఘవ లారెన్స్. తాజాగా ఈ సిరీస్‌లో నాలుగో సినిమాని తెరకెక్కించనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ మూవీకి కూడా లారెన్స్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు ఈ విషయాన్ని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘కాంచన 4’ గా ఇది రానుంది అని తెలియజేసింది. ఈ చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్‌లో మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం వేసవి సెలవల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
2011లో కాంచన విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత 2015లో రెండో పార్టును రిలీజ్ చేయగా పరవాలేదు అనిపించుకుంది. అయితే 2019లో కాంచన-3ను తీసుకురాగా.. ఆ చిత్రం మాత్రం విమర్శలు ఎదుర్కొంది. మరి ఇప్పుడు విడుదలవుతున్న ఈ సినిమా హిట్ అవుతుందా ఫత్ వుతుందా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఇక కాంచన సిరీస్ లో హీరోయిన్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే లారెన్స్..కాంచన 4లో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారు అనే దాని పైన కూడా చర్చ నడుస్తోంది.
Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్ పే నంబర్ అంటూ పిచ్చి రాతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter