Rahul Sipligunj private album రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం తన సాంగ్స్, సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. రంగమార్తాండ సినిమాతో రాహుల్ నటుడిగా మారిపోయాడు. అయితే ఈ చిత్రం ఇంత వరకు విడుదల కాలేదు. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లోకి వచ్చేలా ఉంది. అయితే రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఇప్పుడు దుబాయ్‌లో బిజీగా ఉన్నాడు. తన కొత్త పాటను షూట్ చేసేందుకు దుబాయ్‌కి వెళ్లాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి సారిగా ఓ పాట కోసం ఇలా విదేశాలకు వచ్చి షూట్ చేస్తున్నామని, దీన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నామని రాహుల్ తెలిపాడు. ఇక ఈ పాట కోసం బడ్జెట్ అయితే బద్దల్ బాషింగాలైతానయ్ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. ఇక పాటను ఎలా షూట్‌ చేస్తున్నారో శాంపిల్‌గా ఓ వీడియోను వదిలాడు. చుట్టూ బికినీ భామలతో రాహుల్ రచ్చ చేస్తున్నాడు.


ఈ వీడియోను చూసిన అషూ రెడ్డి హాట్ అంటూ అగ్గి రాజేస్తోన్నట్టుగా ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. అలా రాహుల్ ఈ సారి నాలుగు భాషల్లో ఈ పాటను రిలీజ్ చేసి సందడి చేయాలని ఫిక్స్ అయ్యాడు. గతంలోనూ ఇలానే బేబీ అనే ప్రైవేట్ ఆల్బమ్‌ను చేశాడు. లక్షలకులక్షలు ఖర్చు పెట్టి ఈ పాటను షూట్ చేశాడు. హిందీలోనూ పాటను రిలీజ్ చేశాడు.


 



ఇప్పుడు ఈ పాటతో మరోసారి నేషనల్ వైడ్‌గా సందడి చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అసలే ఇప్పుడు నాటు నాటు పాట సింగర్‌గా రాహుల్ సిప్లిగంజ్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లోనూ రాహుల్ సిప్లిగంజ్ పేరు మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో పునర్నవితో రాహుల్ ట్రాక్.. బయటకు వచ్చాక అషూ రెడ్డితో చేసిన రచ్చ.. పబ్బుల్లో రాహుల్ గొడవలు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


రాహుల్ ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతుంటాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి కూడా తన అభిప్రాయాలను చెప్పి చిక్కుల్లో పడతాడు. అభిజిత్ గురించి కూడా రాహుల్ పరోక్షంగా ఇలాంటి మాటలే మాట్లాడాడు. శ్రీముఖితో బిగ్ బాస్ ఇంట్లో పెరిగిన దూరం ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొత్త ఇళ్లు, కొత్త కారుతో రాహుల్ లైఫ్ అలా సాగిపోతోంది.


Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత


Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook