Rahul Sipligunj: సినీ పరిశ్రమలో ప్రేమగా చిచ్చా అని పిలుచుకునే గాయకుడు ఎవరు అంటే మరోమాట లేకుండా తెలంగాణ పోరడు.. పక్కా హైదరాబాదీ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌ గుర్తుకు వస్తాడు. పాతబస్తీ నుంచి ఆస్కార్‌ స్థాయికి ఎదిగిన రాహుల్‌ ఇప్పుడు సినీ పరిశ్రమలో టాప్‌ స్థాయి గాయకుడిగా ఎదిగాడు. నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ఎంతో ఒదిగి ఉంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా తాను వచ్చిన స్థాయిని మరచి ప్రవర్తించాడు. అలాంటి రాహుల్‌ సిప్లిగంజ్‌ గురించి సోషల్‌ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tamanna Bhatia: పుస్తకాల్లో హీరోయిన్‌ జీవితం.. అందాలు ఆరబోసే తమన్నా మా పిల్లలకు ఆదర్శమా?


 


డ్రగ్స్‌ తీసుకుంటాడని.. గర్వం ఎక్కువ అని.. చిల్లర మనిషి అని రకరకాల దుష్ప్రచారం జరుగుతున్నా వాటిని పట్టించుకోవడం లేదు. తాజాగా అలాంటి విషయాలపై రాహుల్‌ స్పందించాడు. ఓ తెలుగు పాడ్‌కాస్ట్‌ చానల్‌లో మాట్లాడుతూ రాహుల్‌ పలు సంచలన విషయాలు పంచుకున్నాడు. అంతేకాకుండా తాను ఒక పాటకు ఎంత తీసుకుంటాడో.. తాను ఏ స్థాయి నుంచి వచ్చానో.. పాటలు కాకుంటే ఏం చేసేవాడు వంటి విషయాలను రాహుల్‌ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read: Vishwak Sen: 'కల్కి 2898 ఏడీ' సినిమాపై నోరు జారిన విశ్వక్ సేన్.. దెబ్బకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్?


 


తనను హైదరాబాద్‌ ముద్దుబిడ్డగా రాహుల్‌ సిప్లిగంజ్‌ మరోసారి చెప్పుకున్నాడు. పక్కా హైదరాబాదీ.. ధూల్‌పేటలో పుట్టి పెరిగినోడినని చెప్పి.. హైదరాబాదవాళ్లు మనసుగల వారని.. నిండు హృదయం (దిల్‌ ఖుష్‌)తో మాట్లాడుతారని వివరించాడు. ఇంటికి వచ్చిన ఎవరికైనా ముక్క, సుక్క పోయకుండా పంపించనని చెప్పాడు. తనకు మొదటి గుర్తింపు యూట్యూబ్‌ ఇచ్చిందని.. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయని తన సినీ జీవితం విషయమై తెలిపాడు. తనకు జీవితాన్ని కీరవాణి జీవితం ఇచ్చారని.. ఆయనే మొదటి అవకాశం ఇచ్చారని.. ఆయనంటే తనకు ఎంతో గౌరవమని ప్రకటించాడు.


తనకు మాస్‌ పాటలనే ముద్ర పడిందని.. కానీ మెలోడీస్‌, పాప్‌ పాటలు పాడాలనే ఆసక్తి ఉందని రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. తెలుగులో గాయకులకు భారీగా డబ్బులు ఇస్తారని తెలిపాడు. తాను మొదటి పాటకు తొలిసారి కోరస్‌ పాడినందుకు తనకు కీరవాణి రూ.వెయ్యి ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు కోరస్‌ పాడితే రూ.10 వేలు కూడా ఇస్తున్నారని తెలిపారు. ఇక ఆస్కార్‌ వచ్చిన నాటు నాటు పాటకు ఎంత డబ్బు వచ్చిందోనని కూడా రాహుల్‌ బయటపెట్టాడు. ఆ పాటకు రూ.4 లక్షల దాకా డబ్బులు వచ్చాయని రాహుల్‌ నిర్మోహమాటంగా చెప్పాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ పాట పాడించే సమయంలో ఆ సినిమా కోసం తాను పాడినట్లు మొదట తెలియదని చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ఆ విషయం తెలిసిందని రాహుల్‌ వివరించాడు. 


డ్రగ్స్‌ కేసు, పబ్‌లో జరిగిన గొడవల విషయాలు కూడా ఈ ఇంటర్వ్యూలో రాహుల్‌ సిప్లిగంజ్‌ పంచుకున్నాడు. తాను ఇంతవరకు డ్రగ్స్‌ చూడలేదని స్పష్టం చేశాడు. పబ్‌ గొడవలో తన తప్పులేదని.. న్యాయం కోసం పోరాటం చేసినట్లు వెల్లడించాడు. ఇక తాను రాజకీయాల్లోకి వస్తున్న ప్రచారం కూడా స్పందిస్తూ.. 'రాజకీయాలు అనేవి వేరే. నా నియోజకవర్గం గోషామహల్‌ వస్తుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయం నాకు కూడా తెలిసింది. అది ఎలా ప్రచారం జరిగిందో తెలియదు. నేను పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు. రాజకీయాల్లో నా జోన్‌ కాదు' అని రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పష్టం చేశాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి