Raj Tarun Lover Controversy: హీరో రాజ్ తరుణ్ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది. సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా.. రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్నాడు. లావణ్య అనే ఒక అమ్మాయి హీరో రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా తనని ప్రేమించి.. మోసం చేశాడు అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్ లో భాగంగా రాజ్ తరుణ్ తన నెక్స్ట్ సినిమా తిరగబడరా స్వామి హీరోయిన్.. మాల్వి మల్హోత్రాతో తిరుగుతున్నాడు.. అని కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడితో ఆగకుండా తనకి వాళ్ళిద్దరి నుంచి ప్రాణ హాని కూడా ఉంది అంటూ పోలీసులను రక్షణ కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గొడవ మొదట్లోనే రాజ్ తరుణ్ ఈ విషయం గురించి స్పందించాడు. వాళ్లు విడిపోయి.. చాలా కాలం అయింది అని చెప్పుకొచ్చాడు. మరో వైపు హీరోయిన్.. మాల్వి మల్హోత్రా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని లావణ్య పై రివర్స్ లో కేసు పెట్టింది.


ఇక ఈ కేసుల నేపథ్యంలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా తమ సినిమాని.. వాయిదా వేసుకున్నారు. తిరగబడర సామీ సినిమా ఈ నెల అంటే జులై 19న రిలీజ్ అవ్వాలి. కానీ ఈ కేసులు, గొడవల దెబ్బకి సినిమాని వాయిదా వేసేశారు. 


సినిమా విడుదల అంటే ప్రమోషన్స్ చేయాల్సిందే. కానీ ఈ సమయంలో రాజ్ తరుణ్, మాల్వి ప్రమోషన్స్ అని బయటకి వస్తే సినిమా గురించి కంటే అందరూ ఈ కేసు గురించే ప్రశ్నలు అడుగుతారు. ఎంత వాడించినా.. లావణ్య గురించిన ప్రశ్నలు అయతే తప్పవు. అప్పుడు రాజ్ తరుణ్ ఇమేజ్ బ్యాడ్ అవుతుంది. అందుకే ఇప్పుడు సినిమా రిలీజ్.. అయితే కష్టమే అని తిరగబడరా సామీ సినిమాని ఆగస్టు 2కు వాయిదా వేశారు.


ఆగస్టు 2 అంటే కూడా కేవలం రెండు వారాలు మాత్రమే వాయిదా వేసినట్టు. మరి అప్పటికి రాజ్ తరుణ్ కేసు వేడి చల్లారుతుందా అంటే చెప్పలేము. పోనీ సినిమాని ఇంకా వాయిదా వేద్దామా..అంటే పెద్ద సినిమాల హడావిడి లో కొట్టుకుపోతుంది. లేదంటే ప్రమోషన్స్ లేకుండానే సినిమాని రిలీజ్ చేయాలి. ఏదేమైనా ఈ సమయంలో రాజ్ తరుణ్.. మీద ఇలాంటి కేసులు అతని కెరీర్ పై గట్టిగానే ఎఫెక్ట్ చూపించేలా ఉన్నాయి.


Also Read: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


Also Read: Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి