RRR Rajamouli Steven Spielberg of India: రాజమౌళి ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్.. చరణ్ కామెంట్స్ వైరల్!
Ram Charan on Rajamouli: రాజమౌళి అంటేనే ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్ గా భావిస్తూ ఉంటామని గుడ్ మార్నింగ్ అమెరికా త్రీ అనే ఒక ప్రోగ్రాం లో రామ్ చరణ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందామా?
Ram Charan on Rajamouli in USA Good Morning America 3 Show: రామ్ చరణ్ తేజ మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్న సంగతి తెలిసిందే, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా త్రీ అనే ఒక ప్రోగ్రాం లో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంకి సంబంధించి సౌత్ ఇండియా నుంచి వెళ్లిన మొట్టమొదటి యాక్టర్ గా రామ్ చరణ్ రికార్డులకు ఎక్కారు. ఇక అమెరికా వెళ్ళిన తర్వాత సదరు ప్రోగ్రాం లో పాల్గొన్న రామ్ చరణ్ తేజ రాజమౌళి గురించి వారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో మీరు పని చేయడం ఎలా ఉంది అని అక్కడి యాంకర్లు ప్రశ్నిస్తే దానికి రామ్ చరణ్ తేజ స్పందించిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ తేజ మాట్లాడుతూ రాజమౌళి అంటేనే ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్ గా భావిస్తూ ఉంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నాటు నాటు పాట గురించి ప్రస్తావిస్తూ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని దానికి కారణం మా దర్శకుడు రాజమౌళి అని ఈ సందర్భంగా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా మా దర్శకుడి అద్భుతమైన ఆలోచనల నుంచి పుట్టిన ఒక అద్భుత దృశ్య కావ్యం అని ఈ సందర్భంగా రామ్ చరణ్ పేర్కొన్నారు. ఇక రాజమౌళి ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్ అని పేర్కొనడంతో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్, మీకు అర్థమవుతుందా అంటే కచ్చితంగా అర్థమవుతుందని ఇప్పటికే ఆయన ఎవరో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.
ఆయన చేయబోతున్న తర్వాత సినిమా కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోంది, కచ్చితంగా అందరిని ఆయన అందరికీ గ్లోబల్ గా కనిపిస్తాడని ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ కామెంట్ చేశారు. ఇక రామ్ చరణ్ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. మెగా అభిమానులు అయితే రామ్ చరణ్ తేజ మరో రికార్డు బద్దలు కొట్టాడు అంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
Also Read: Ram Charan Good Morning America Show : ఇదీ రామ్ చరణ్ రేంజ్.. ఆ హాలీవుడ్ స్టార్ల తరువాత మనోడే.. అమెరికాలో మెగా పవర్