Lal Salaam Review: జైలర్ మూవీ తర్వాత రజనీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై బజ్ బాగా క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత రజినీకాంత్ హీరోగా కాకుండా.. రజినీకాంత్ కేవలం ఒక గెస్ట్ గా చేసిన లాల్ సలామ్ చిత్రం విడుదలకు సిద్ధమై ఈరోజు ఫిబ్రవరి 9న దేశవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీలో రజనీకాంత్ పాత్ర తెరపై అరగంటకు పైగా ఉంటుంది అని మేకర్స్ స్పష్టం చేస్తున్నప్పటికీ.. మూవీ పై ఊహించిన హైప్ మాత్రం కనిపించ లేదు. ఈ నేపథ్యంలో రజనీ గెస్ట్ రోల్ చేసిన కొన్ని సినిమాల ఫలితాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. ఈ చిత్రంపై అభిమానులకు కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు రజనీకాంత్ గెస్ట్ రోల్ ప్లే చేసిన తమిళ్, హిందీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకున్న దాఖలాలు లేవు. తెలుగులో మోహన్ బాబు హీరోగా వచ్చిన పెదరాయుడు చిత్రం లో రజనీకాంత్ ఆయన తండ్రి పాత్రలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ మూవీ అప్పట్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. రజనీ కీలక పాత్ర పోషించిన ఆ ఒక్క చిత్రం తప్ప మిగిలిన సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి. 1993లో వల్లి అనే మూవీలో రజిని ఓ కీలక పాత్ర పోషించారు. అదే చిత్రాన్ని విజయ అనే పేరుతో తెలుగులో అనువదించారు. అయితే ఆ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.


2008లో వచ్చిన రీమేక్ చిత్రం కథానాయకుడిలో జగపతిబాబు ఫ్రెండ్ గా రజినీకాంత్ గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ మూవీ ఫ్లాప్ గా మిగిలింది. షారుక్ ఖాన్ తీసిన రా వన్ చిత్రంలో.. చిట్టి ఇది రోబో గెటప్ లో కొన్ని నిమిషాలు కనిపించి సందడి చేశాడు రచన. ఇలా హిందీలో చాలా సినిమాల్లో గెస్ట్ రోల్ ను ప్లే చేశారు.. కానీ అవి అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో లాల్ సలామ్ విషయంలో కూడా ఇలాగే అవుతుంది ఏమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇక స్టోరీ విషయానికి వస్తే ఇందులో రజనీ.. ఒక గ్రామంలో తలెత్తిన రెండు వర్గాల సమస్యను క్రికెట్ ద్వారా పరిష్కరించాలి అని ప్రయత్నించే ఓ ముస్లిం పెద్దమనిషిగా కనిపిస్తాడు. రజని ఎంట్రీ మూవీలో సెకండ్ హాఫ్ లో ఉంది అని టాక్. మరోపక్క కేవలం మూవీ బిజినెస్ పెంచడం కోసం ట్రైలర్ లో రజనీని ఎక్కువగా హైలైట్ చేశారని.. ఒరిజినల్ సినిమాలో రజనీ పాత్ర అంత హైలెట్ కాదు అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలి అంటే ఈ వారాంతం వరకు వేచి చూడాలి.


Also Read: Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక


Also Read: AP DSC Notification 2024: ఎట్టకేలకు ఏపీలో డీఎస్సీ ప్రకటన విడుదల.. పోస్టులు, దరఖాస్తుల వివరాలు ఇవిగో..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook