Rajinikanth Dubbing For Baba Movie : రజినీకాంత్ నటించిన బాబా సినిమా ఎంతటి అంచనాల నడుమ రిలీజ్ అయిందో,ఎలాంటి ఫలితాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ అయింది. కానీ ఈ చిత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. మితి మీరిన అంచనాల నడుము రావడం, రజినీ స్టైల్‌, ఫైట్స్, పాటలు ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచడం మొదటికే మోసం వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఆర్ రెహమాన్ సంగీతం, చోటా కే నాయుడు ఫోటోగ్రఫీ, సురేష్ కృష్ణ టేకింగ్ అన్నీ బాగానే ఉన్నా కూడా.. కథ సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. ఇక రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్, స్టైల్‌ ఇలా అందరినీ మెప్పించింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. ఈ సినిమాకు నిర్మాతగా రజినీ ఉండటంతో.. నష్టపోయిన వారందరికీ కూడా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు.


రజినీకాంత్ తన డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిళ్లకుండా చూసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ బాబా సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతోన్నాడు. అసలే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్స్ నడుస్తున్నాయి. కొత్త సినిమాలకంటే ఇలా పాత సినిమాలను రిలీజ్ చేసుకుంటూనే లాభాలు ఎక్కువగా వస్తున్నాయి.


ఆల్రెడీ మహేష్‌ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ఓ రేంజ్లో కలెక్షన్లు రాబట్టేసింది. ఇప్పుడు కోలీవుడ్‌కూ ఈ ట్రెండ్ పాకింది. రజినీకాంత్ బర్త్ డే డిసెంబర్ 12న కావడంతో.. అదే రోజు లేదా.. అంతకంటే ముందే బాబా సినిమాను రిలీజ్ చేస్తారట. దాని కోసం స్పెషల్‌గా రజినీ డబ్బింగ్ కూడా చెబుతున్నాడట. కొన్ని సీన్లను యాడ్ చేస్తున్నారట. ఇంకొన్ని సీన్లు తీసేస్తున్నారట. మొత్తానికి రజినీ మేనియా మరోసారి తెరపై బాబా సినిమాతో అందరూ చూడబోతోన్నారన్న మాట.
 


Also Read : Prabhas Kriti Sanon Marriage : కృతి సనన్‌తో త్వరలోనే పెళ్లి.. ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడట!


Also Read : RC 16 మీద కొత్త చర్చ.. బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుంచి అతడ్ని పీకేశారా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook