RC 16 మీద కొత్త చర్చ.. బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుంచి అతడ్ని పీకేశారా?

RC 16 Ram Charan Buchi Babu Sana Project రామ్ చరణ్‌ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను రామ్ చరణ్‌తో చేసేస్తున్నాడు బుచ్చిబాబు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 03:52 PM IST
  • RC 16 అప్డేట్ వైరల్
  • రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ కన్ఫామ్
  • దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టేశారా?
RC 16 మీద కొత్త చర్చ.. బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుంచి అతడ్ని పీకేశారా?

RC 16 Music Director రామ్ చరణ్‌, బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లే నిజమయ్యాయి. ఎట్టకేలకే ఈ ఇద్దరి ప్రాజెక్ట్ ఓకే అయింది. గౌతమ్ తిన్ననూరిని సైడ్ చేసిన రామ్ చరణ్ బుచ్చిబాబుతో సెట్ అయ్యాడు. అటు సైడ్ అయితే ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చిన బుచ్చి బాబు.. రామ్ చరణ్‌తో సై అన్నాడు. అలా చివరకు ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం ఇప్పుడు అధికారికమైన ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్‌కు చెప్పింది స్పోర్ట్స్ డ్రామా అని, కబడ్డీ నేపథ్యమని అప్పట్లో టాక్ వచ్చింది.

మరి అదే కథను రామ్ చరణ్‌కు బుచ్చిబాబు వినిపించాడా? అన్నది తెలియడం లేదు. ఇదంతా ఒకలా ఉంటే.. ఈ నిర్మాత, ప్రొడక్షన్ కంపెనీ పేరులో తేడా ఉంది. మైత్రీ మూవీస్ అంటే.. నవీన్, రవిశంకర్ వంటి వారు కనిపించాలి. కానీ కొత్తగా ఇంకో పేరు కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఇంకా కన్ఫామ్ చేయలేదనిపిస్తోంది.

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ, బుచ్చిబాబు అంటే కచ్చితంగా దేవీ శ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. కానీ ఈ సినిమాకు మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తొంది. పోస్టర్లో దేవీ శ్రీ ప్రసాద్ పేరు కనిపించడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ను కావాలనే పక్కన పెట్టేశారని కొందరు.. ఏఆర్ రెహ్మాన్‌ను తీసుకుంటున్నారని ఇంకొందరు ఇలా ఎవరికి తోచింది వారు అనేస్తున్నారు.

అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నెన్నో సీక్రెట్లు అలా బయటకు రాకుండానే ఉన్నాయి. మైత్రీ నిర్మాతల మధ్య వైరం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అసలే దేవీ ఇప్పుడు నాసిరకమైన సంగీతాన్ని ఇస్తున్నాడనే ఇలా పక్కన పెట్టేశారా? మరేతర కారణమైనా ఉందా? అన్నది తెలియడం లేదు.

Also Read : Katrina Kaif in Saree : కత్రినా కైఫ్ కాదు.. అందాల నైఫ్.. పైట పక్కకు జరిపేసిన బాలీవుడ్ బ్యూటీ

Also Read : Actor Thiruveer : ఐదారు టేక్స్ తీసుకున్నా.. సినిమా ఆఫర్ రాదనుకున్నా.. మసూదపై తిరువీర్ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x