Prabhas Kriti Sanon Marriage : కృతి సనన్‌తో త్వరలోనే పెళ్లి.. ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడట!

Prabhas Kriti Sanon Marriage Rumors ప్రభాస్ కృతి సనన్ పెళ్లి రూమర్లు ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. భేడియా ప్రమోషన్స్‌లో భాగంగా కృతి సనన్ ప్రభాస్ ప్రేమ కథల మీద హాట్ టాపిక్ నడుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 04:47 PM IST
  • జాతీయస్థాయిలో ప్రభాస్ పెళ్లి రూమర్లు
  • మనసు పడ్డ కృతి సనన్?
  • ప్రభాసే ప్రపోజ్ చేశాడంటూ ట్వీట్
Prabhas Kriti Sanon Marriage : కృతి సనన్‌తో త్వరలోనే పెళ్లి.. ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడట!

Prabhas Kriti Sanon Marriage : ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించారు. ఇంత వరకు ఈ ఇద్దరికి సంబంధించిన పోస్టర్ అయితే రాలేదు. టీజర్లో ఒకే ఒక్క షాట్ కనిపించింది. అయితే సీతారాములుగా ఈ ఇద్దరూ నటించేశారు. జానకీరాములుగా ఇండియన్ స్క్రీన్ మీదకు రాబోతోన్నారు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడిపోయారనే టాక్ ఒకటి బీ టౌన్ పుట్టించేసింది. కృష్ణంరాజు చనిపోయిన సమయంలోనూ ప్రభాస్ ప్రేమ, పెళ్లి మీద రూమర్లు రాసింది జాతీయ మీడియా.

ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోందని నేషనల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంది. ఇక కృతి సనన్ ఇప్పుడు వరుణ్ ధావన్ భేడియా (తెలుగులో తోడేలు) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పరోక్షంగా ప్రభాస్ మీద చర్చలు జరుగుతున్నాయి. కృతిని ఏడిపించేందుకు వరుణ్ ధావన్ పదే పదే పరోక్షంగా ప్రభాస్ పేరు తీస్తున్నాడా? లేదా నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? అన్నది తెలియడం లేదు.

 

డార్లింగ్ ఆమె లైఫ్‌లోకి వచ్చాడు.. కృతి మనసులో ఉన్న వ్యక్తి ముంబైలో లేడు.. ప్రస్తుతం దీపికతో కలిసి షూటింగ్ చేస్తున్నాడు అంటూ ఇలా హింట్లు ఇస్తూనే ఉన్నాడు వరుణ్‌ ధావన్‌. అయితే ఇప్పుడు ఉమైర్ సంధు వేసిన ట్వీట్‌ మీద జనాలు మండి పడుతున్నారు. అతడి పిచ్చి ట్వీట్‌ను చూసి జాలి పడుతున్నారు.

 

అఫీషియల్లీ కన్పార్మ్డ్‌.. ఆదిపురుష్‌ షూటింగ్‌లో కృతి సనన్‌కు ప్రభాసే ప్రపోజ్ చేశాడు.. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు.త్వరలోనే నిశ్చితార్థం అంటూ ట్వీట్ వేశాడు. దీంతో జనాలు నవ్వుకుంటున్నారు. ఒరేయ్.. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నామంటే నమ్మేవాళ్లమే కానీ.. ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడు అని అన్నావ్ చూడు అక్కడే నువ్ దొరికిపోయావ్ రా అంటూ ఇలా దారుణంగా తిడుతున్నారు.

Also Read : RC 16 మీద కొత్త చర్చ.. బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుంచి అతడ్ని పీకేశారా?

Also Read : Katrina Kaif in Saree : కత్రినా కైఫ్ కాదు.. అందాల నైఫ్.. పైట పక్కకు జరిపేసిన బాలీవుడ్ బ్యూటీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News