Rajinikanth Health Update, Rajinikanth Undergoes Cartoid Artery Revascularisation, Likely To Be Discharged Soon: సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీ హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే రజినీ కాంత్ (Rajinikanth) జనరల్‌ చెకప్‌ కోసం ఆయన హాస్పిటల్‌కు వెళ్లినట్లు ఆయన భార్య లత వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా కావేరీ ఆసుపత్రి (Kauvery Hospital) వైద్యులు రజనీ హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపై చిరంజీవితో పాటు టాలీవుడ్ నటుల దిగ్భ్రాంతి


రజినీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. రజినీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను (Carotid Artery) గుర్తించామని చెప్పారు. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్నారు. అవసరమైన ట్రీట్‌మెంట్ (Treatment) అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్‌ నుంచి‌ డిశ్చార్జ్ (Discharge) చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి (Kauvery Hospital) వైద్యులు పేర్కొన్నారు. ఇక శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ‘అన్నాత్తే’ దీపావళికి విడుదల కానుంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook