Rakhi Sawant Sensational Comments on Modi: బాలీవుడ్ డ్రామా క్వీన్ గా పేరున్న రాఖీ సావంత్ గత కొన్నాళ్ల నుంచి అనేక కారణాల వల్ల వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ఆమె కొన్ని షాకింగ్ స్టేట్‌మెంట్స్ తో మరోమారు తెరపైకి వచ్చింది. తాజాగా రాఖీకి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, రాఖీ తన బాధను వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాటలు విన్న అందరూ షాక్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకంటే రాఖీ మాట్లాడుతూ తాను చాలా కష్టాల్లో ఉన్నానని, దీనికి కారణం 'మోదీ జీ' అని అన్నారు. అసలు విషయం ఏమిటంటే రాఖీ సావంత్ ఇటీవల విమానాశ్రయంలో ఫోటో గ్రాఫర్ లకు కనిపించింది. రాఖీ కారు నుండి దిగిన వెంటనే, ఛాయాచిత్రకారులు ఆమె ముఖాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె ముఖం వాచిపోయి ఉంది. అదేంటి అని అడిగితే దానికి రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కారు దిగగానే  'మోదీ జీ నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను రెండు రాత్రులు నిద్రపోలేదు. బూస్టర్ డోస్ వేసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదని అంటూ ఆమె కామెంట్ చేసింది.


గుండె దడదడలాడుతోందన్న రాఖీ నా శరీరమంతా ఏమి జరుగుతుందో నాకు తెలియడం లేదని ఆమె పేర్కొన్నారు. నా ముఖం ఉబ్బిపోయిందని కూడా ఆమె చూపించారు. నాకు నిద్ర పట్టడం లేదన్న ఆమె అరగంట కూడా నిద్ర పోలేక పోతున్నానని చాలా దారుణమైన స్థితిలో తాను ఉన్నానని అన్నారు. ఇక ఈ బూస్టర్ ఇంజెక్షన్ 60, 70, 80, 90 సంవత్సరాల వయస్సు గల వారికి ఇవ్వాలి అని నేను భావిస్తున్నాను. లేవలేని వారు. వారు దానిని తీసుకోవాలని తాను భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు రాఖీ బూస్టర్ డోస్‌లో షిలాజిత్ అలాగే వయాగ్రా వంటి వాటిని కలపడం జరిగిందని, ఇది బూస్టర్ డోస్‌ కాదని కామ ఇంజెక్షన్‌ అని అభివర్ణించారు.


Also Read: Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!


Also Read: Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook