Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?

Pawan Kalyan Suffering with illness:  వరుస పర్యటనల కారణంగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం.  ఆయన డాక్టర్ల సలహాలతో రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 12:22 PM IST
  • పవన్ కళ్యాణ్ కు అస్వస్థత
  • అభిమాని మీద పడడంతో వెన్నునొప్పి
  • జ్వరం లక్షణాలు కూడా ఉండడంతో రెస్ట్
Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?

Pawan Kalyan Suffering with illness: వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నా సరే మరోపక్క రాజకీయాల్లో కూడా ఆయన అంతే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. గత కొంత కాలం వరకు ఎక్కువగా సినిమాలు రాజకీయాలు అంటూ సమయం వెచ్చిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా మారడంతో కాస్త సినిమాలు కూడా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది.

ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి అనే విషయం మీద కూడా సందిగ్దత కొనసాగుతోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర అలాగే జనవాణి అని అంటూ ఆంధ్రప్రదేశ్ లో జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ వరుస పర్యటనల కారణంగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వానలో తడుస్తూ సభలో పాల్గొనడం మాత్రమే కాక ఆ సమయంలో ఒక అభిమాని మీద పడిపోవడంతో పవన్ కు వెన్నునొప్పి ప్రారంభమైందని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా వరుస షెడ్యూల్స్ ఉండడంతో ఆ కార్యక్రమాలతో ఆయన పాల్గొన్నారు. అలా గ్యాప్ లేకుండా రెస్ట్ తీసుకోకుండా వరుస పర్యటనలలో పాల్గొన్న నేపథ్యంలో ఆయనకు అస్వస్థత ఏర్పడినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆయన తీవ్రమైన జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారని అంటున్నారు.

ప్రస్తుతానికి ఆయన డాక్టర్ల సలహాలతో రెస్ట్ తీసుకుంటున్నారని వీలైనంత త్వరలో మళ్లీ రాజకీయాలు యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. గతంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదే విధంగా అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఎప్పుడు బయటకు వస్తారా అని వారంతా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి లేదా పార్టీ తరపున ఏదైనా అధికారిక ప్రకటన వస్తే గాని అసలు పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 

Also Read: Rashmika Mandanna:అందుకే అతనితో రష్మిక బ్రేకప్.. సంచలన విషయం బయట పెట్టిన వేణుస్వామి

Also Read: Aishwarya Rai Pregnant: మరోసారి తల్లవుతున్న ఐశ్వర్య రాయ్.. ఈ వీడియోనే సాక్ష్యం!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News