Urvashi Rautela: హ్యాండిచ్చిన రకుల్.. `ఊర్వశి`లా వచ్చి ఆదుకుందే!
Urvashi Rautela special song in ‘Bro’: పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రలలో బ్రో పేరుతో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది.
Urvashi Rautela special song in ‘Bro’: పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రలలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విడుదల సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ చిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో డైరెక్ట్ చేసి హీరోగా నటించిన సముద్రఖని ఈ సినిమాని తెలుగులో డైరెక్ట్ చేస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. వాస్తవానికి తమిళ సినిమాలో ఇలాంటి ఐటెం సాంగ్స్ ఏమీ లేవు కానీ తెలుగు సినిమా అంటే తెలుగు ఆడియన్స్ కి కావాల్సిన విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ మార్క్ ఇందులో చూపిస్తున్నారు.
Also Read: Bandla Ganesh: ఇంతకంటే ఏం కావాలి దరిద్రం..చంద్రబాబుపై బండ్ల సంచలనం
ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తూ ఉండడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే బాగుంటుందని భావించి ఐటమ్ సాంగ్ చేసేందుకు గాను రకుల్ ప్రీత్ సింగ్ తో సంప్రదింపులు జరిపారు. దానికి ఆమె ఒప్పుకుంది కూడా. రేపటి నుంచి ఈ సినిమా ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా శుక్రవారం నాడు తాను సోమవారం నుంచి షూట్లో పాల్గొనలేనని ఇతర సినిమాలను మేనేజ్ చేసుకోలేక డేట్స్ క్లాష్ అవుతూ ఉండడం వల్ల రాలేకపోతున్నానని చెప్పింది. ఇక అప్పటికప్పుడు సినిమా యూనిట్ వెంటనే ఊర్వశి రౌతేలాను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఊర్వశి రౌతేలా ఇప్పటికే రెండు తెలుగు సాంగ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బ్రో సినిమాతో ఆమెకు మరో సాంగ్ దొరికింది. సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ అనగానే అందరి దృష్టి పడుతోంది. ఊర్వశి రౌతేలా ఇప్పటికే వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ సాంగ్ కి డాన్స్ చేసింది. అలాగే అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాలో కూడా ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది. ఇది ఆమెకు మూడవ సాంగ్ గా నిలవనుంది.
Also Read: Sharwanand Reception: పెళ్లైంది..ఇక టాలీవుడ్ జనానికి భారీ రిసెప్షన్ ప్లాన్ చేసిన శర్వా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK