Sharwanand Reception: పెళ్లైంది..ఇక టాలీవుడ్ జనానికి భారీ రిసెప్షన్ ప్లాన్ చేసిన శర్వా!

Sharwanand Reception News: శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరగగా ఇక వారి ఎంగేజ్మెంట్ జూన్ 9న హైదరాబాదులో జరగనుంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 4, 2023, 04:13 PM IST
Sharwanand Reception: పెళ్లైంది..ఇక టాలీవుడ్ జనానికి భారీ రిసెప్షన్ ప్లాన్ చేసిన శర్వా!

Sharwanand and Rakshita Reception for Tollywood: చాలా కాలం నుంచి శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహం గురించి జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. శర్వానంద్ రక్షిత రెడ్డి అనే యువతిని వివాహం చేసుకుంటున్నాడు అనే విషయం కూడా చాలా గోప్యంగా ఉంచారు. చివరికి వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వీరి వివాహం జూన్ మూడో తేదీ అంటే ఆదివారం తెల్లవారుజామున వివాహం ఘనంగా జరిగింది.

రాజస్థాన్లోని జైపూర్ లీలా ప్యాలెస్ లో రాజుల వివాహాన్ని తలదన్నే రీతిలో వీరి వివాహం అయితే జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పెళ్లికి శర్వానంద్ కి అత్యంత సన్నిహితులైన కొంతమంది తప్ప తెలుగు సినీ పరిశ్రమ నుంచి అసలు ఎవరూ హాజరు కాలేదు. ఇక్కడి నుంచి పెళ్లికి వెళ్లిన వారిలో రామ్ చరణ్ ఒక్కడే కాస్త పేరు ఉన్న హీరో. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూన్ 9వ తేదీన శర్వానంద్ టాలీవుడ్ హీరోలు అందరికీ కలిపి ఒక రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Anasuya Bharadwaj Photos: రచ్చ రేపుతున్న వైట్ కలర్ బికినీలో అనసూయ భరద్వాజ్..మామూలుగా లేదుగా!

ఇక శర్వానంద్ రక్షిత పెళ్లి హడావిడి రెండు రోజులు ముందు నుంచే మొదలైపోయింది. వీరి వివాహం ముహూర్తం ప్రకారం మూడో తేదీ అయినా సరే ముందు నుంచి సంగీత్, మెహందీ అని ఇలా రకరకాల వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక వీరి వివాహం మూడవ తేదీ నాడు ఘనంగా జరగడంతో 9వ తేదీ నాడు హైదరాబాదులోని సినీ సెలబ్రిటీలందరికీ కలిపి ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని రిసెప్షన్ కూడా అదే రోజు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

శర్వానంద్ ఇక సినిమాల విషయానికొస్తే ఒకే ఒక జీవితం ద్వారా హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల లైన్ లో పెట్టగా ఇప్పుడు ఆసక్తికరమైన కథలు మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Ashima Narwal Photos: బ్లాక్ కలర్ గౌనులో అషిమా నర్వాల్ అందాలు చూడతరమా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News