Rakul Preet Singh Clarity: ప్రియుడితో పెళ్లి వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ వింత రియాక్షన్.. కొత్త అనుమానాలు రేపిందిగా!
Rakul Preet Singh Clarity on Her Marriage with Jacky Bhagnani: రకుల్ ప్రీత్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందని అమన్ ప్రీత్ కామెంట్ చేయడంతో దానిపై రకుల్ వెటకారంగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే
Rakul Preet Singh Clarity on Her Marriage with Jacky Bhagnani: కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టి మంచి పేరు సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె మొదటి సినిమాతోనే హిట్టు అందుకుని తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో భాగమైంది.
తెలుగులో దాదాపుగా టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ తో కాస్త ఢీలా పడింది. ఆ తరువాత కొండ పొలం లాంటి అవకాశాలు వచ్చినా సరే తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఈ భామ ప్రస్తుతానికి బాలీవుడ్ లోనే పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఈ భామ తాను బాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నానని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని అధికారికంగా ప్రకటించింది.
ఇలా ప్రకటించి ఏడాది దాటుతున్నా సరే వీరి పెళ్లెప్పుడు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరగబోతోంది అంటూ మీడియాకి చెప్పినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం మీద రకుల్ ప్రీత్ సింగ్ వెటకారంగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా తన తమ్ముడి అకౌంట్ ను ట్యాగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ అమన్ ఈ విషయం గురించి నిజంగానే చెప్పావా? ఒకవేళ నిజంగా చెప్పి ఉంటే నా పెళ్లి ఎప్పుడో నాకు కూడా చెప్పు అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఆమె చేసిన కామెంట్లను బట్టి ఆమె పెళ్లి ఇప్పటిలో అయితే లేనట్టేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పడు తెలుగులో సినిమాలతో బిజీగా లేకపోయినా హిందీలో మాత్రం రెండు చేతులా ఆఫర్లు అందుకుంటూ ఆమె బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కాబోయే భర్తకు స్వయంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండడంతో ఆ బాధ్యతలను కూడా ఈ భామ భుజాన వేసుకుందనే టాక్ అయితే బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పక తప్పదు.
Also Read: Puri Jagannadh-Chiranjeevi : లైగర్ చూసి కూడా ఛాన్స్ ఇస్తాడట.. చిరు పూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కేనా?
Also Read: Vijay Antony Divorce : విడాకులు తీసుకోనున్న విజయ్ ఆంటోనీ.. గొడవలుంటే ఇళ్లు వదిలేసి వెళ్లండన్న హీరో