Actress Rakul preet Singh name in drugs case: టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ వర్కవుట్స్, ఫిట్‌నెస్‌లు, సోషల్ యాక్టివిటీస్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. రకుల్ గత వారం రోజులుగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏమీ పోస్ట్ చేయలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పార్టీలలో రకుల్, సారా అలీ ఖాన్, ఒక ఫ్యాషన్ డిజైనర్ మాదకద్రవ్యాలను సేవించినట్లు రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులకు తెలియజేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అలాగే విచారణ సమయంలో రకుల్ పేరును రియా చక్రవర్తి ( Actress Rhea Chakraborty ) పేర్కొన్నట్లు ఎన్‌సిబి ధృవీకరించినట్టుగానూ అప్‌డేట్స్ వెలువడుతున్న క్రమంలో రకుల్‌కి ఈ కేసులో లీగల్ ట్రబుల్స్ తప్పవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read : Sai Pallavi remuneration: సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటినుండి సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్‌పై ట్రోల్స్ ( Trolls on Rakul preet Singh ) మొదలయ్యాయి. దీంతో రకుల్ గత వారం నుండి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమీ పోస్ట్ చేయకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. Also read : Actress Rashmika Mandanna: హైదరాబాద్‌లో లగ్జరీ బంగ్లా కొన్న రష్మిక ?


రకుల్‌కి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కలిపి సుమారు 20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ హీరోయిన్స్‌లో రకుల్ ఒకరు. కొంతమంది నటీమణులు కూడా రకుల్ ప్రీత్ సింగ్‌కి మద్దతు ఇస్తున్నారు. వారిలో సమంత అక్కినేని ( Samantha Akkineni ) కూడా ఒకరు. Also read : Samantha Akkineni's next: మరో ఛాలెంజింగ్ పాత్రలో సమంత


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR