Samantha Akkineni's next: మరో ఛాలెంజింగ్ పాత్రలో సమంత

లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి సమంత అక్కినేని ( Samantha Akkineni ) షూటింగ్స్ ఆగిపోవడంతో పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. సినిమాలతో పాటు పలు బిజినెస్‌లు ప్రారంభించి బిజీ అయింది. సమంత తదుపరి చిత్రం 'గేమ్ ఓవర్' ( Game over movie ) ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Last Updated : Sep 16, 2020, 11:29 PM IST
  • విభిన్న రకాల పాత్రలు ఎంచుకుంటున్న సమంత అక్కినేని.
  • ఓ బేబీ మూవీతో తానేంటో మరోసారి నిరూపించుకున్న సమంత
  • అలాంటి మరో ఛాలెంజింగ్ పాత్ర కలిగిన సినిమాకు సైన్ చేసిన సమంత.
Samantha Akkineni's next: మరో ఛాలెంజింగ్ పాత్రలో సమంత

లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి సమంత అక్కినేని ( Samantha Akkineni ) షూటింగ్స్ ఆగిపోవడంతో పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. సినిమాలతో పాటు పలు బిజినెస్‌లు ప్రారంభించి బిజీ అయింది. సమంత తదుపరి చిత్రం 'గేమ్ ఓవర్' ( Game over movie ) ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సమంత ఒక మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శారీరక వైకల్యాలున్న పాత్రను సమంత చేయడం ఇదే మొదటిసారి. ఇదివరకు ఎన్నడూ చూడని సమంతను ఈ థ్రిల్లర్‌ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. Also read : Red movie: రెడ్ మూవీ థియేటర్లలోనే అంటున్న రామ్

సమంత ఇటీవల కాలంలో చేసిన ఓ బేబి, మజిలీ, రంగస్థలం వంటి చిత్రాలు ఆమెలోని నటిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే ఈ మూవీ కూడా సమంతను మరో ఛాలెంజింగ్ పాత్రలో చూపించనుందట.

సమంత ఇకపై ఎక్కువగా మహిళా ప్రాధాన్యమైన చిత్రాలకు మాత్రమే సంతకం చేయనుంది అని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతున్న 'నిశ్శబ్దం' ( Nishabdham movie) సినిమాలో అనుష్క కూడా మూగ అమ్మాయి పాత్రలో నటించింది. Also read : Bigg Boss 4 Telugu love story: బిగ్ బాస్ హౌజ్‌లో ట్రయాంగిల్ లవ్ స్టొరీ

మరోవైపు శ్రియ శరణ్ ( Shriya Saran in Gamanam ) సైతం గమనం అనే మూవీలో మూగ యువతి పాత్రలోనే కనిపించనుంది. సుజనా రావు డైరెక్ట్ ( Director Sujana Rao ) చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. Also read : Amitabh Bachchan: బచ్చన్ ఇంటికి మరింత భద్రత

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News