Rakul Preet Singh in Pink Cinderella: రకుల్ ప్రీత్ సింగ్ సోమవారం జరిగిన ఒక ఈవెంట్‌లో పింక్ సిండ్రెల్లా డ్రెస్‌లో కనిపించి తళుక్కున మెరిసింది. ఆ అందమైన డ్రెస్సులో అంతకంటే అందమైన రకుల్ ప్రీత్ సింగ్‌ని చూసి ఈవెంట్‌కి వచ్చిన వారు తమ చూపు తిప్పుకోలేకపోయారు. సిండ్రెల్లా దుస్తుల్లో రాజకుమారిలా హోయలుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుస్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్‌ని అలా చూసిన వాళ్లు.. " బాలీవుడ్ సిండ్రెల్లా " అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ప్లాన్ బి కూడా ఉంది అని చెప్పుకొచ్చింది. తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు కాలేజీ చదివే రోజుల్లో ముంబైకి వచ్చానని.. ఒక రెండేళ్లపాటు సినిమాల్లో ట్రై చేసి.. ఒకవేళ తనకు సినిమాలు కలిసి రావు అని అనుకున్నట్టయితే... ఆ తరువాత మళ్లీ తన చదువును కొనసాగించాలి అని అనుకున్నట్టు వెల్లడించింది. 


తాను మ్యాథ్స్ గ్రాడ్యూయేట్‌ని అని గుర్తుచేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఒకవేళ హీరోయిన్‌గా తన కెరీర్ క్లిక్ కాకపోయి ఉంటే.. మళ్లీ ఉన్నత చదువులకు వెళ్లిపోయే దానిని అని చెప్పుకొచ్చింది. సినిమాల్లో నిలదొక్కుకోకపోతే.. ఫ్యాషన్ విభాగంలో ఎంబీఏ చదివే ఆలోచన ఉండేది అని.. కానీ లక్కీగా అటువైపు వెళ్లాల్సిన అవసరమే రాలేదు అని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టంచేసింది.


క్రమశిక్షణ అనేది తన కెరీర్‌ను చక్కగా డిజైన్ చేసుకునేందుకు చాలా వరకు ఉపయోగపడిందన్న రకుల్ ప్రీత్ సింగ్.. తమది ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవడింది అని పేర్కొంది. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఆర్మీ అధికారి అనే విషయం తెలిసిందే. 


తనకు ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదని.. పూర్తిగా బయటి వ్యక్తిలా వచ్చి ఇక్కడ కెరీర్ అరంభించాను. తన కెరీర్ ఎలా మొదలైందో కూడా తనకే తెలియకుండా జరిగిపోయింది. అయినప్పటికీ తాను సక్సెస్ అయ్యానంటే అది కేవలం తన క్రమశిక్షణ వల్లే సాధ్యపడింది అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.



ఇది కూడా చదవండి : Jabardasth Artist Hari: రెడ్ శాండల్ఉడ్ స్మగ్లింగ్ కేసులో జబర్ధస్త్ ఆర్టిస్ట్


తాను ఖాళీగా అసలే ఉండనన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఒకవేళ తనకు ఖాళీ సమయం దొరికినా.. ఆడిషనింగ్‌లో పాల్గొనడం లాంటి పనులతో ఒక షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటుంటానని.. " రోజూ నువ్వు ఇన్ని గంటలు కష్టపడితే కచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు " అనే సత్యాన్ని బలంగా నమ్ముతాను. అందుకే ఎప్పుడూ ఖాళీగా ఉండను అని గొప్ప జీవిత సత్యాన్ని వెల్లడించింది. అందుకే అనతికాలంలోనే స్టార్ హీరోయిన్స్ సరసన చేరడమే కాకుండా.. నాలుగు సినిమాలతోనే కెరీర్ నాశనం చేసుకుంటున్న హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లోనూ రకుల్ ప్రీత్ సింగ్ ఒక ప్లాన్ ప్రకారం కెరీర్లో ముందుకెళ్తోంది. అన్నట్టుగా ఆ మధ్య సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో తప్పితే రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎక్కడా వినపడిన దాఖలాలు కూడా లేవు కదా..


ఇది కూడా చదవండి : Urfi Javed's Pizza Top: పిజ్జా అడ్డం పెట్టుకుని అర్ధనగ్నంగా డాన్స్.. ఎవరైనా తింటే పరిస్థితి ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK