Ram Charan birthday celebrations video: రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మెగా పవర్ స్టార్‌కి ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి అంటేనే క్రియోటివిటీకి పెట్టింది పేరనే సంగతి తెలిసిందేనాయే. అందుకే చెర్రీకి తన స్టైల్లోనే HBD Ram Charan అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ని సినిమా షూటింగ్స్‌కి ఉపయోగించే భారీ క్రేన్స్ సహాయంతో గాల్లోకి లేపుతుంటే, అప్పుడు చెర్రీ ముఖంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చీకట్లో జువ్వుమని పైకి లేస్తున్న తారా జువ్వల మధ్య పెద్ద అక్షరాలతో హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అని ఉన్న హోర్డింగ్ చూస్తే ఎవరికైనా వారెవ్వా.. వాటే నైస్ సర్‌ప్రైజ్ అని అనిపించకమానదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌లోనే రాజమౌళి చెర్రీకి ఈ బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ (Birthday cake) కట్ చేసి తమ ఆనందాన్ని, అభిమానాన్ని పంచుకున్నారు. ఆ సర్‌ప్రైజ్ ఏంటో, ఎలా ఉందో మీరే చూడండి.



 


రామ్ చరణ్‌కి తమదైన స్టైల్లో బర్త్ డే సర్‌ప్రైజ్ ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఏ లిటిల్ సర్‌ప్రైజ్ టు అవర్ స్వీటెస్ట్ రామరాజు అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. Ram Charan birthday celebrations photos ని కూడా మరో ట్వీట్‌లో పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత, డివివి ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత డివివి దానయ్య, ఆర్ఆర్ఆర్ మూవీ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ సహా ఇతర సాంకేతిక నిపుణులు, సిబ్బంది అంతా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో (Ram Charan birthday celebrations) పాల్గొన్నారు. 


 


Also read : RRR Poster: రామ్ చరణ్‌కి మరో Birthday gift ఇచ్చిన రాజమౌళి


ప్రస్తుతం రామ్ చరణ్‌కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ మాత్రమే జరుగుతుండటంతో రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr, Ram Charan on RRR sets) పాల్గొనలేదు. లేదంటే Ram Charan's birthday party సెలబ్రేషన్స్‌లో ఇంకొంత సందడి కనిపించేది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook