Viral photos: RRR షూటింగ్ స్పాట్‌లో NTR, Ram Charan

RRR movie shooting photos: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని వేచిచూసేలా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే.. అది ఆర్ఆర్ఆర్ మూవీనే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

Last Updated : Feb 5, 2021, 08:15 PM IST
  • తారక్, చెర్రీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న వైరల్ ఫోటో.
  • ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ సెట్స్‌లో తారక్, చెర్రీ పిచ్చాపాటి ఫోటో.
  • దర్శకధీరుడి డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్
Viral photos: RRR షూటింగ్ స్పాట్‌లో NTR, Ram Charan

RRR movie shooting photos: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని వేచిచూసేలా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే.. అది ఆర్ఆర్ఆర్ మూవీనే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్‌తో, భారీ VFX works తో, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంతకంటే భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా... అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. అలాంటివే తాజాగా ఈ ఫోటోలో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కొన్ని ఫోటోలు, వీడియోలు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పలేం. ఎందుకంటే ఆ ఫోటోలు, వీడియోలే అభిమానులతో మాట్లాడుతాయంటుంటారు. ప్రస్తుతం NTR fans, Ramcharan fans ని ఆకట్టుకుంటున్న ఈ ఫోటోలు కూడా అలాంటివే.  RRR movie climax shooting లో తారక్, చెర్రీ పిచ్చాపాటి వేసుకుంటున్న ఈ ఫోటోలను ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ట్విటర్‌లో రిలీజ్ చేయగా.. తారక్, చెర్రీ గురించి ఫ్యాన్స్ తమకు నచ్చినట్టుగా కాంప్లిమెంట్స్, కామెంట్స్ రాసుకుంటున్నారు.

 

Also read : Radhe Shyam teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ వచ్చేనా ?

SS Rajamouli డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీలో తారక్ Komaram Bheem పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Alluri Seetharama Raju పాత్రలో కనిపించనున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో Ajay Devgn, బాలీవుడ్ బ్యూటీ Alia bhatt ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News