Ram Charan Buchi Babu Sana Movie on Cards: నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో కాకుండా త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో ఆయన త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసి కొరటాల శివతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ప్రశాంత్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటన వచ్చింది. కానీ అంతలోపే బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్, అప్పుడు ఎందుకు గ్రీన్ సింగల్ ఇచ్చారో తెలియదు కానీ అయితే ఆ తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయలేనని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఇప్పుడు బుచ్చిబాబు అదే కథను తీసుకొని రాంచరణ్ దగ్గరకు వెళితే దానికి రామ్ చరణ్ ఎస్ చెప్పడంతో ఆ సినిమా పట్టాలెక్కెందుకు రంగం సిద్ధమైంది. నిజానికి ఎన్టీఆర్- బుచ్చిబాబు ప్రాజెక్టుని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించాలని భావించింది. అయితే ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ దగ్గరికి వెళ్లడంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం నుంచి తప్పుకుంది అని తెలుస్తోంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న సతీష్ కిలారు అనే వ్యక్తి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు ఒక కొత్త బ్యానర్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తున్నారు. వృద్ధి అనే సంస్థ పేరుతో ఆయన ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని సమర్పించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాత సతీష్ కిలారు ఒక్కరే అయినా రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సమర్పించబోతున్నట్లుగా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కథ పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.


ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రేపు ఉదయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 150 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాంచరణ్ ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా అంటే శంకర్తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఆ తరువాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.


Also Read: Puri Jagannadh : లైగర్‌ ఎఫెక్ట్.. చాలా రోజులకు పూరి జగన్నాథ్ చిల్.. పిక్ వైరల్


Also Read: HIT 2 Business: దుమ్ము రేపిన హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook