HIT 2 Business: దుమ్ము రేపిన హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్!

HIT 2 Business: అడివి శేష్ హీరోగా హిట్ 2 అనే సినిమా రూపొందగా అది వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేర చేసింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వివరాల్లోకి వెళ్తే   

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 27, 2022, 02:41 PM IST
HIT 2 Business: దుమ్ము రేపిన హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్!

Adivi Sesh HIT 2 Pre Release Business details: తెలుగులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రిలీజ్ అయిన హిట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విశ్వక్సేన్ హీరోగా రహానీ శర్మ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమాకు శైలేష్ కొలను డైరెక్టర్గా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమాతోనే డైరెక్టర్గా మారారు. నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కూడా వస్తుందని అప్పట్లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హిట్ 2 సినిమాని కూడా రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.

ఈ సినిమాను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా అడిగితే ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ రెండో తేదీన ఘనంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. హిట్ మొదటి భాగం సూపర్ హిట్ కావడం అడవి శేష్ గత మూవీ మేజర్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకి అడవి శేషు కెరీర్ లోనే అత్యధిక రైట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా నైజాం హక్కులు ఐదున్నర కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది, అలాగే సీడెడ్ ప్రాంతం హక్కులు రెండు కోట్లకు, మిగతా ఆంధ్ర ప్రాంతం హక్కులు ఏడు కోట్లకు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ చూస్తే 14.30 కోట్ల రూపాయలు దాకా జరిగిందని, మిగతా భారతదేశం సహా ఓవర్సీస్ లో ఈ సినిమా మూడున్నర కోట్ల రూపాయలు దాకా హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 కోట్ల రూపాయల మేరకు హక్కులు అమ్ముడుపోగా 18 1/2 కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తే సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. మొదటి వీకెండ్ గట్టి వసూళ్లు రాబట్టడమే కాక మరో పది రోజులు పాటు సినిమా సత్తా చూపగలిగితే ఈ మేర వసూళ్లు వెనక్కి రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ చూసి చాలామంది భయపడినట్లు కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అడవి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా భానుచందర్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Also Read: Samantha Health Update: అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సమంత.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

Also Read: Prabhas Head Cap: ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా తలకు క్యాప్ ఉండాల్సిందే.. దానికి రీజన్ తెలిస్తే షాక్ అవుతారు.?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News