Ram Charan: మరో కొత్త కారు కొన్న రామ్ చరణ్.. ఖరీదు ఎంతంటే..?
Ram Charan Car Collection: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. వందల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన ఈయన తాజాగా మరో కార్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
Ram Charan cars : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇటీవల గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఒక్కొక్క సినిమాకు రూ.60 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయన పలు యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ కు మాత్రమే రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే రామ్ చరణ్ ఎప్పుడూ కూడా తన స్టేటస్ను లగ్జరీ కార్ల రూపంలోనే చూపిస్తారు అనడంలో సందేహం లేదు. ఈయనకు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఒక కారు కొనుగోలు చేసిన ఈయన ఇప్పుడు మరో కార్ ని కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా మరో రోల్స్ రాయిస్ కార్ ను కొనుగోలు చేసిన రామ్ చరణ్ దీనికోసం రూ.7.5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.
ఇక ఈ వెహికల్ కు రిజిస్టర్ చేయడానికి ఆయన ఖైరతాబాద్ లోని ఆర్టీవో కార్యాలయానికి కూడా విచ్చేశారు. ఇక రోల్స్ రాయిస్ స్పెక్టర్ లో బ్లాక్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే అన్నీ కూడా లగ్జరీ హై ఎండ్ ఫోర్ వీలర్స్ కావడం గమనార్హం.రామ్ చరణ్ దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే.. రూ.4 కోట్ల విలువ చేసే..మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 కార్ ఈయన సొంతం. అంతేకాదు రూ.3.50 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 తో పాటూ.. రూ. 2.75 కోట్ల విలువ చేసి ఫెరారీ పోర్టోఫినో
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఈయన సొంతం.
అలాగే రూ.175 కోట్లు విలువ చేసే
BMW 7 సిరీస్ కార్ తో పాటూ రూ.1 కోటి విలువ చేసే.
Mercedes Benz GLE 450 AMG Coupe కార్ ఈయన కార్ గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం.
Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.