Ram Charan - Game Changer Jaragandi Song Release: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో రామ్ చరణ్‌ గ్లోబర్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు గ్లోబల్ స్టార్ బిరుదును సంపాదించుకున్నాఉడ.  ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి 'జరగండి' అనే లిరికల్  పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. దలేర్ మెహందీ, సునీధి చౌహాన్ ఆలపించారు. మొత్తంగా శంకర్ గత చిత్రాల మాదిరే ఈ పాట ఉంది. మొత్తంగా ఈ పాటలో శంకర్ మార్క్ కనపడింది. సాంగ్ పిక్చరైజ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రామ్ చరణ్, కియారా అద్వానీల ఈ సాంగ్‌.. మాస్‌లో కిక్ ఎక్కించడం ఖాయం అనే చెప్పాలి.  రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం  చరణ్.. రాజమౌళి కంటే ముందు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన  శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' చిత్రం చేస్తున్నారు.ఈ మూవీల రామ్ చరణ్‌ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్ చరణ్‌. ఈ సినిమా ఈ ఇయర్ లాస్ట్‌లో   విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక 'గేమ్ ఛేంజర్' మూవీ విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్ ఖరారాయ్యాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఐదు భాషలకు కలిపి దాదాపు రూ. 100 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మొత్తం అన్ని భాషలకు సంబంధించిన దాదాపు రూ.50 కోట్లు పలికినట్టు సమాచారం. అంతేకాదు మ్యూజిక్ రైట్స్ సరేగమా వాళ్లు రూ. 25 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఈ రకంగా నాన్ థియేట్రికల్‌గానే నిర్మాతకు రూ. 175 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ దక్కడం మాములు విషయం కాదు.


ఈ సినిమాలో రామ్ చరణ్  పాత్రతో పాటు  ముఖ్యమంత్రి పాత్రకు మంచి స్కోప్ ఉందట. ఈ రోల్‌ను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే శంకర్ వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్ మోహన్‌లాల్‌కు వినిపించాడట. ఆయన కూడా స్టోరీ నచ్చి ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌..  రామ్ నందన్ అనే IAS అధికారి పాత్రలో నటిస్తున్నాడట. ఈ క్యారెక్టర్ మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ స్పూర్తితో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.


'గేమ్ ఛేంజర్' మూవీని దిల్ రాజు భారీ నిర్మాణ విలువలతో తెరెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ..గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ చేస్తూనే.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.


Also read: CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 

 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook