Orange Re Release Collections రామ్ చరణ్‌ నటించిన ఆరెంజ్ మూవీ ఆనాడు డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ ఓ వర్గానికి మాత్రం ఆరెంజ్ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. నాగబాబు అయితే పలు మార్లు ఆరెంజ్ వల్ల పూర్తిగా మునిగిపోయానని, నష్టపోయానని చెప్పుకొచ్చాడు. అయితే రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని మళ్లీ థియేటర్లోకి తీసుకొచ్చారు. గత వీకెండ్ మొత్తం అరెంజ్ మేనియానే కనిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరెంజ్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి నాగబాబు సైతం మురిసిపోయాడు. ఇంత డిమాండ్ ఉందా? ఇంతగా షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయా? అని ఆశ్చర్యపోయారు. ఒక తరం ముందే సినిమాను తీశామన్నమాట.. ఈ సినిమాను ఇప్పుడు తీసి ఉంటే కచ్చితంగా హిట్ ఉండేది.. మేం ముందుగానే సినిమాను తీశామని నాగబాబు చెప్పుకొచ్చాడు.


అయితే ఇప్పుడు ఆరెంజ్ కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నైజాంలో ఈ సినిమాకు దాదాపు 78 లక్షల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే 28.88 లక్షల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా కేవలం మూడు రోజుల్లోనే వచ్చిందని సమాచారం. అయితే ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడంతో.. అటు ఒక్కడు, ఇటు ఖుషి రికార్డులు ఖతమ్ అయినట్టుగా తెలుస్తోంది.


 



గతంలో ఒక్కడు సినిమాను రిలీజ్ చేస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక్కడు సినిమాకు ఐదు రోజుల్లో 26.44 లక్షలు వచ్చినట్టు తెలుస్తోంది. ఖుషి రికార్డులను కూడా బ్రేక్ చేసినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికీ ఆరెంజ్ సినిమాకు డిమాండ్ ఉండటంతో కొన్ని చోట్ల షోలను వేస్తున్నారు. ఆరెంజ్ సినిమాను ప్రదర్శించే థియేటర్లన్నీ కూడా ప్రైవేట్ కాన్సర్ట్‌లు పెట్టినట్టుగా పాటలు రీ సౌండ్‌తో మార్మోగిపోతోన్నాయి. ఇప్పటి యూత్ అంతా కూడా ఆరెంజ్ సినిమాకు, పాటలకు కనెక్ట్ అవుతున్నారు.


Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook