Ram Charan tweet: రామ్ చరణ్ ట్వీట్ వెనుకున్న మతలబేంటి
రామ్ చరణ్ చేసిన ఓ ట్వీట్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనియాంశమైంది. ``లిజెనింగ్ టు క్రెడిబుల్ ఇన్‌ఫర్మేషన్ ఓన్లీ`` అని చెర్రీ చేసిన ఈ ట్వీట్‌పై ( Ram Charan`s tweet ) అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ చేసిన ఓ ట్వీట్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనియాంశమైంది. ''లిజెనింగ్ టు క్రెడిబుల్ ఇన్‌ఫర్మేషన్ ఓన్లీ'' అని చెర్రీ చేసిన ఈ ట్వీట్‌పై ( Ram Charan's tweet ) అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే... ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ చేస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ( RRR movie shooting ) నిలిచిపోయిందని.. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆ సినిమా షూటింగ్ ఇప్పట్లో జరిగేలా లేదు అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ పుకార్లను పట్టించుకునే ఉద్దేశం తనకు లేదంటూ రాంచరణ్ పరోక్షంగా ఈ ట్వీట్ చేశాడా లేక మరోదైనా కారణం ఉందా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
( Also read: Rana Daggubati: రానా పెళ్లి కోసం ఆ మూడు రోజులు.. )
ఇదిలావుంటే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) తెరకెక్కించిన పవర్ స్టార్ చిత్రం జనవరి 25న ఆడియెన్స్ ముందుకు రానుంది. పవర్ స్టార్ మూవీ ( Power star movie ) విడుదలను వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు పలువురు రాంగోపాల్ వర్మ కార్యాలయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదంపై రామ్ చరణ్ ఏమని స్పందిస్తారా అంటూ అభిమానులు, మీడియా వాళ్లు ఆయన స్పందన కోరే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో.. ఈ వివాదానికి తాను అంతగా ప్రాధాన్యత ఇవ్వదల్చుకోవడంలేదని చెప్పే ఉద్దేశంతోనే చెర్రీ ఈ ట్వీట్ చేసి ఉంటాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా.. చెర్రీ అసలు ఉద్దేశం ఏంటో తెలియాలంటే ఆయన నోరు విప్పే వరకు వేచిచూడాల్సిందే. ( Also read: Rana Daggubati: రానా దగ్గుబాటి పెళ్లికి తేదీ, వేదిక ఫిక్స్.. వివరాలు ఇవే )