Coronavirus Movie: కరోనావైరస్కు రుణపడి ఉన్నాను: ఆర్జీవీ
కరోనా ( Coronavirus ) లాక్‌డౌన్ నాటినుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం నిలిచిపోయింది.. కానీ ఆ దర్శకుడు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా గడిపాడు. పలు సినిమాలను సైతం ఆన్‌లైన్‌లో విడుదల చేసి ఔరా అనిపించుకున్నాడు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ).
RGV's Coronavirus Movie: కరోనా ( Coronavirus ) లాక్‌డౌన్ నాటినుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం నిలిచిపోయింది.. కానీ ఆ దర్శకుడు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా గడిపాడు. పలు సినిమాలను సైతం ఆన్‌లైన్‌లో విడుదల చేసి ఔరా అనిపించుకున్నాడు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ). వర్మ తీసే సినిమాలు సైతం ఆసక్తికరంగా భిన్నంగా ఉంటాయి. కరోనా మహమ్మారినే కథగా చేసుకొని ‘కరోనావైరస్’ (Coronavirus Movie) అనే హర్రర్ సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రాన్ని ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లాక్‌డౌన్ అనంతరం సినిమా థియేటర్లు ప్రారంభమైన తరువాత వర్మ చిత్రం కరోనావైరస్ తొలి చిత్రంగా విడుదల కానుంది.
ఈ చిత్రం విడుదల పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడారు. ముందుగా తనను నమ్మి ఈ చిత్రంలో నటించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ టైమ్‌లో హీరోలు, దర్శకులు అంట్లు తోముకుంటూ, వంటలు వండుకుంటూ, ఇళ్లు ఊడ్చుకుంటూ టైమ్‌పాస్ చేస్తే తాను మాత్రం సినిమాలు తీశానంటూ పేర్కొన్నారు. కరోనావైరస్ దీవెనలు ఉండడం వల్లనే ఎవరూ కరోనా బారిన పడలేదని చెప్పారు. అందుకే కరోనా వైరస్‌కు తాను రుణపడి ఉన్నానంటూ పేర్కొన్నారు. Also read: Sonal Chauhan: లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ లేటెస్ట్ పిక్స్ చూశారా..?
అయితే ఈ చిత్రానికి దర్శకుడు అగస్త్య మంజు (Agasthya Manju) దర్శకత్వం వహించగా, నట్టికుమార్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ ( Srikanth Iyengar), వంశీ చాగంటి, సోనియా ఆకుల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు ట్రైలర్లను రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
Also Read| Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు
Also read | Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..
Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook