Ram Gopal Varma Serious on Sekhar raju: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లడ్కి. ఈ సినిమాను తెలుగులో అమ్మాయి పేరుతో విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ నిర్మాత శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా దానికి అనుగుణంగా స్టే ఇచ్చింది. తాజాగా ఈ విషయం మీద రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని, దానిపై శేఖర్ రాజు అనే వ్యక్తి స్టే తెచ్చారని అన్నారు. ఆయన వల్లే సినిమా ఆగిపోయిందన్న వర్మ, హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు నాపై ఆలిగేషన్ పెట్టారని అన్నారు. శేఖర్ రాజు కోర్ట్ ను తప్పుదారి  పట్టించి  స్టే తీసుకున్నాడని, తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టులో కేసు వేశారని అన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు  పంజాగుట్ట పోలీసులకు అందించానన్న రామ్ గోపాల్ వర్మ ఇలా ఇదొక ఆనవాయితీగా గా మారుతోందని వర్మ విమర్శించారు.


సినిమా ఆపడం అనేది మంచి విషయం కాదన్న ఆయన అలాంటి విషయాలు మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు  పెట్టానని వెల్లడించారు. ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చిందో వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారని వర్మ అన్నారు. వాళ్ళ అంతు చూస్తా... చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నామని అన్నారు. అసలు తాను శేఖర్ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, బ్లాక్ మెయిల్  చేసి సెటిల్మెంట్ చేసుకుందాం అనే భావనతో శేఖర్ ఇదంతా చేస్తున్నారని వర్మ విమర్శించారు. మరి చూడాలి ఈ వివాదం ఎంతదాకా వెళుతుంది అనేది. 


Also Read: Sithara: అప్పుడే పదేళ్లా.. సితారకు మహేష్-నమ్రతలు ఎమోషనల్ విషెస్


Also Read: Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook