RGV Vyooham Trailer: రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీయల్‌ సబ్జెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. వ్యూహాం అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచబోతున్నాడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ షురూ చేశాడు ఆర్జీవీ. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోనియా గాంధీ పాత్ర ఫోన్ కాల్ మాట్లాడటంతో వ్యూహం ట్రైలర్ ప్రారంభం అవుతుంది. జగన్ పాత్ర చేస్తున్న వ్యక్తికి సోనియా ఫోన్ చేసి ఓదార్పు యాత్ర ఆపేయాలని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు చంద్రబాబు పాత్ర తెరపై కనిపించి ఇప్పుడు మన వ్యూహం మొదలు అవుతుంది అని చెబుతాడు. జగన్ పాత్ర పాదయాత్ర చేయడం, సీబీఐ విచారణ, సంక్షేమ పథకాల గురించి జగన్ భార్య పాత్ర చెప్పడం వంటి సీన్లు చూపించారు. మరోవైపు ఒంటరిగా పోటి చేస్తే గెలుస్తానా అంటూ పవన్ పాత్రతో డైలాగ్ చెప్పించారు. ఆ కల్యాణ్‌కు ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయ్యా అంటా చంద్రబాబు పాత్ర చెబుతుంది. జగనా.. నా ముందు వాడు పిల్ల పిత్రేగాడు అంటూ చంద్రబాబు పాత్ర డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ ముగిసింది.


ఈ ప్రాజెక్టు రెండు భాగాలుగా రూపొందుతుంది. ఇందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. తొలి భాగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తనదైన మార్కుతో చూపించాడు ఆర్జీవీ. రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10న ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు. అలాగే దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న శపథం మూవీని వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. 



Also Read: OMG 2 Remake: తెలుగులో రీమేక్‌ కానున్న అక్షయ్ ‘ఓ మై గాడ్‌2’.. హీరో అతడేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి