RRRపై సస్పెన్స్ పెంచిన రామ్ చరణ్, తారక్ ట్వీట్స్
Ramaraju For Bheem | బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR.ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్నారు.
Ramaraju For Bheem Tomorrow | బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR.ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ), యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ( Jr NTR ) నటిస్తున్నారు. కరోనావైరస్ వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోగా ఇటీవలే మళ్లీ మొదలైంది. దాంతో ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్స్ కోసం తెగ వేచి చూస్తున్నారు. అయితే అక్టోబర్ 22న మంచి అప్డేట్ ఉంటుంది అని సినిమా టీమ్ కొంత కాలం క్రితమే తెలిపింది.
తాజాగా రామ్ చరణ్, తారక్ ట్వీట్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అక్టోబర్ 22న అద్భుతమైన అప్టేట్ ఉంటుంది అని రామ్ చరణ్ చిన్నాపాటి టీజర్ కట్ షేర్ చేశాడు.
దీనికి తారక్ ను ట్యాగ్ చేస్తూ ఇలా ట్వీట్ చేశాడు చెర్రీ
బ్రదర్ నిన్ను ఆటపట్టించేందుకు ఒకటీ తీసుకొచ్చా...
నీలా కాకుండా నేను టైమ్ పాటిస్తా... అని ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ తారక్ ఇలా ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ బ్రో, నువ్వు ఐదు నెలలు లేటు అని నీకు తెలుసా...
కానీ జాగ్రత్త..మనం రాజమౌళితో వ్యవహరిస్తున్నాం.. ఏమైనా జరగవచ్చు..
ఏదేమైనా, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది... అని ట్వీట్ చేశాడు తారక్..
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR