RGV Sensational Tweet on Chiranjeevi, Prabhas, Mahesh babu and CM Jagan: ఏపీ సినిమా టికెట్ల వివాదం సద్దుమణుగుతుండగా..వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియల్ మెగాస్టార్ వైఎస్ జగన్ అంటూ మిగిలిన నటుల్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేట్టు కన్పిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖులు చర్చలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేశ్, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్ నారాయణ మూర్తి తదితరులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. త్వరలో ఈ సమస్య పరిష్కారమై శుభవార్త వింటారని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అప్పట్నించి జరిగిన చర్చలపై కాస్త ట్రోలింగ్ నడుస్తోంది. ఈలోగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అందరు హీరోల్ని జీరోలుగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రియల్ మెగాస్టార్‌గా అభివర్ణిస్తూ చేసిన ట్వీట్‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.



అతి సాధారణ ప్రజా ప్రతినిధులుగా వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానిలు సూపర్ అని..మెగా, బాహుబలి, స్టార్స్ కంటే పెద్ద స్టార్స్‌లా అన్పించారని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఎందుకంటే రీల్ స్టార్స్ భిక్షాటన చేస్తున్నట్టుగా ఆరాధించే ట్వీట్స్ చేశారన్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పేర్ని నానిలు కనీసం ట్వీట్ కూడా చేయలేదని గుర్తు చేశాడు. అందరి హీరోల్ని హీరోస్ ఆర్ జీరోస్ అని వైఎస్ జగన్ నిరూపించారంటూ మరో ట్వీట్ చేశాడు.



Also read: FIR Movie: ఎఫ్ ఐ ఆర్ సినిమాలోని ఆ సన్నివేశాలపై ముస్లింల అభ్యంతరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook