FIR Movie: ఎఫ్ ఐ ఆర్ సినిమాలోని ఆ సన్నివేశాలపై ముస్లింల అభ్యంతరం

FIR Movie: విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఎఫ్ఐఆర్ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా క్షమాపణలు చెప్పింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2022, 11:37 AM IST
FIR Movie: ఎఫ్ ఐ ఆర్ సినిమాలోని ఆ సన్నివేశాలపై ముస్లింల అభ్యంతరం

FIR Movie Controversy: విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఎఫ్ఐఆర్ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా క్షమాపణలు చెప్పింది.

ఫిబ్రవరి 11న అంటే నిన్న విడుదలైన ఎఫ్ ఐ ఆర్ సినిమాపై ప్రశంసలు, విమర్శలు వస్తున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయనేది కొంతమంది వాదన. ఆ సన్నివేశాల్ని సినిమా నుంచి, ప్రమోషనల్ వీడియోల నుంచి తొలగించాలనే డిమాండ్ విన్పిస్తోంది. అసలేం జరిగిందంటే..

ఎఫ్ ఐ ఆర్ సినిమాలో హీరో విష్ణు విశాల్  ఓ ముస్లిం వ్యక్తి. అటు విలన్ కూడా ముస్లిం టెర్రరిస్ట్‌గా ఉంటాడు. దేశంలో అరాచకం సృష్టించేందుకు ఆ విలన్ చేయని ప్రయత్నముండదు. హీరోలో విలన్ పోలికలుండటంతో..అధికారులు అతడిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తుంటారు. ఈ క్రమంలో సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఎంఐఎం నేత, యాకుత్ పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ..తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు ఈ విషయమై లేఖ రాశారు. ఎఫ్ ఐ ఆర్ సినిమాలోని (FIR Movie)సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం సినిమా నుంచి, ప్రమోషన్ వీడియోల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించాలని కోరారు. తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 8 ప్రకారం ఆ సన్నివేశాల్ని తొలగించాలని స్పష్టం చేశారు. 

అయితే తమ సినిమా ఏ మతస్థుల్ని కించపరిచేట్టు తీయలేదని, ప్రతి ఇండియన్ గర్వించే విధంగా తీశామంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే ముస్లిం మనోభావాల్ని కించపరిచేటట్టు ఉందని కొన్ని ప్రాంతాల్లో సినిమాను నిలిపివేశారు. ఇది కేరళలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తీసిని సినిమా అని.మనోభావాలు దెబ్బతిన్నట్టు అన్పిస్తే తమ తరపున ముస్లింలకు క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు.

Also read: Jagapathi Babu: అవ‌య‌వ‌దానానికి ముందుకొచ్చిన జగపతిబాబు, బర్త్ డే సందర్భంగా కీలక నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News