ఆర్జీవీ కూతురు రేవతి వర్మ ఇటీవలే ఆయన చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్టుపై స్పందించారు. ఆయన పవన్ కళ్యాణ్ కుమారుడి పేరుకి వివరణ ఇస్తూ.. రాసిన ఒక పేరాగ్రాఫ్ తనకేమీ అర్థం కాలేదని, వర్మ ఏవో అర్థం పర్థం లేని పదాలతో ఆ పోస్టు పెట్టారని.. ఆమె కామెంట్ చేశారు. దీనికి వర్మ స్పందించారు. రేవతిని తన కూతురు అనే కన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనవచ్చని.. ఆమెకు ఇలాంటి విషయాలపై ఉన్న తక్కువ అవగాహన వలన తన పోస్టును అర్థం చేసుకోలేకపోయిందని తెలిపారు. ఆమెకు పవన్ కపట మేధావితనం తెలియదని.. చిత్రమేంటంటే, తాను ఆమె ప్రేమించినదానికంటే ఎక్కువగా పవన్‌ను ప్రేమిస్తున్నానని ఆ పోస్టులో తెలిపారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు. ఆ పేరు మీద చాలా మంది వివిధ రకాలుగా స్పందించారు. ఆ పేరు పెట్టడం ద్వారా పవన్ తన అన్న చిరంజీవి పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారని తెలిపారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్‌లోని "శంకర్" పేరు తీసుకొని పవన్ తన కొడుక్కి పెట్టారని కొందరు అభిప్రాయపడ్డారు. అదే పేరుపై వర్మ కామెంట్ చేస్తూ.. ఇలాంటి పేరు తాను క్రీస్తు పూర్వం నుండి మధ్య ఈజిప్టులోని 26వ సామ్రాజ్య కాలం వరకు.. ఎప్పుడూ వినలేదని అర్థం వచ్చేలా ఓ పోస్టు పెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING