Ramya Raghupathi Says Naresh Filed Suite Stating an Affair with Krishna: ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల కుమారుడు నటుడు నరేష్ ఇటీవల నాలుగో వివాహం చేసుకోబోతున్నాను అని చెబుతూ ఒక లిప్ కిస్ వీడియో కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరు చేసిన ప్రకటన కంటే వీరు లిప్ కిస్ చేస్తూ చేస్తున్న వీడియో మాత్రం హైలెట్ అయింది. ఇక ఈ వీడియో విడుదలైన తర్వాత నరేష్ మూడో భార్య రఘువీరా రెడ్డి సోదరుడు కుమార్తె రమ్య రఘుపతి మరోసారి మీడియా ముందుకు వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో కన్నడ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్న ఆమె ఇప్పుడు తెలుగు మీడియం ముందుకు వచ్చి తన బాధంతా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు రెండున్నర గంటల ఇంటర్వ్యూలలో అనేక విషయాలు నరేష్ గురించి ఆమె బయట పెట్టారు. నరేష్ చాలా దుర్మార్గుడని ఆయనకు ఎంతోమందితో అక్రమ సంబంధాలు ఉండేవని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. ఇంట్లో పనిమనిషితో కూడా అక్రమ సంబంధం ఉందని నేను తప్పు పడితే అప్పటి నుంచి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అందుకే నేను రాఖీ కట్టిన అన్నతో, ఇంటి డ్రైవర్ తో కూడా నాకు అక్రమ సంబంధం అంట కడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


అంతే కాదు తాను ఒక తండ్రిలా భావించి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా నాకు అక్రమ సంబంధం ఉందని నరేష్ కోర్టులో కేసు వేశాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రాణాలకు హాని ఉందని ఆయన చెప్పినట్లుగా ఒక కేసు నా మీద కోర్టులో పెట్టారని కృష్ణ సంతకం ఫోర్జరీ చేసి ఈ కేసు నరేష్ పెట్టినట్టు తనకు తెలిసిందని ఆమె చెప్పకు వచ్చారు. ఈ కేసులో పిటిషన్ వేసిన వారు ఎవరి మీద వేశారో వారు ఇద్దరు కూడా కో హ్యాబిటట్ అంటే ఒక లివింగ్ రిలేషన్ లో ఉండడం లేదా అక్రమ సంబంధం కలిగి ఉండటం వంటి సంబంధం ఉందని వేసిన కేసులో నరేష్ పేర్కొన్నాడని, ఇంతకన్నా దారుణం ఏముంటుంది అని ఆమె ప్రశ్నించారు.


ఈ విషయాన్ని కృష్ణ గారి దృష్టికి తీసుకు వెళ్ళమని మా కుటుంబ సభ్యులు చాలామంది నాకు చెప్పారు, కానీ అప్పటికే విజయనిర్మల గారిని రమేష్ బాబుని కోల్పోయి బాధపడుతున్న ఆయనని మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఈ విషయం ఆయన దృష్టికి తీసుకు వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తం మీద రమ్యా రఘుపతి బయట పెడుతున్న ఒక్కొక్క విషయం కూడా షాక్ గురి చేస్తున్నాయి అని చెప్పక తప్పదు.


Also Read: Veera Simha Reddy Trailer: ఒంటి చేత్తో ఊచకోత కోస్తా ** కొడకా..పూనకాలు తెప్పిస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్!


Also Read: Balakrishna Targetted YS Jagan: జగన్ ను టార్గెట్ చేసిన బాలయ్య.. చరిత్ర అంటూ కౌంటర్లు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook