రానా దగ్గుబాటి పెళ్లికి తేదీ, ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 8న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ( Falaknuma palace ) తను ప్రేమించిన మిహికా బజాజ్‌ ( Mihika Bajaj ) మెడలో రానా దగ్గుబాటి తాళి కట్టబోతున్నాడు. ఇటీవలె ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ ( Rana Daggubati's engagement ) జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి ఇంకెన్నో రోజులు లేకపోవడంతో ప్రస్తుతం దగ్గుబాటి వారి కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల్లో ఈ పెళ్లి జరగనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ )


కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపిస్తున్నందున పెళ్లిళ్లు, ఇతర వేడుకలపై ప్రస్తుతం కొవిడ్-19 ఆంక్షలు ( COVID-19 norms ) అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అనుగుణంగా అతికొద్ది మంది అతిథులు, అతి సమీప బంధు, మిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లిని జరిపించాలని సురేష్ బాబు ( Suresh Babu ) భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక మంది సినీ ప్రముఖులు, ఎంతో మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగిన కుటుంబం కావడంతో అతిథులను ఫిల్టర్ చేయడం ఆ కుటుంబానికి కత్తిమీద సాములా మారిందని సమాచారం. ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )